Heavy Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం..ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు
కశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మంచు కురుస్తున్న వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు.
శ్రీనగర్ నగరం, లోయలోని ఇతర మైదానాలలో ఈ సీజన్‌లో మొదటి హిమపాతంతో సహా, శుక్రవారం నుండి కాశ్మీర్‌లో మోస్తరు నుండి భారీ హిమపాతం నమోదైంది.
దక్షిణ కాశ్మీర్ లోని మైదానాల్లో భారీ హిమపాతం నమోదు అయ్యింది. మధ్య కాశ్మీర్‌లోని మైదానాల్లో ఓ మోస్తరు హిమపాతం నమోదైంది. ఉత్తర కాశ్మీర్‌లోని మైదానాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వరకు మంచు కురిసింది.
శ్రీనగర్ లో దాదాపు 8 అంగుళాల హిమపాతం నమోదు అయ్యింది. పొరుగున ఉన్న గండర్‌బాల్‌లో ఏడు అంగుళాల మంచు కురిసింది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన సోనామార్గ్‌లో ఎనిమిది అంగుళాల మందపాటి మంచు పడింది.
శ్రీనగ్-లేహ్ హైవేపై దాదాపు 15 అంగుళాల మేర మంచు పడగా, అనంతనాగ్ జిల్లాలో 17 అంగుళాల మేర మంచు కురిసింది. పర్యాటక పట్టణం పహల్గామ్‌లో 18 అంగుళాల తాజా హిమపాతం నమోదైంది.
పుల్వామా జిల్లాలో 10-15 అంగుళాల హిమపాతం నమోదైంది. పొరుగున ఉన్న కుల్గాంలో 18-25 అంగుళాల హిమపాతం, షోపియాన్‌లో 18 అంగుళాల హిమపాతం నమోదైంది.
మంచు కురుస్తున్న కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా నవయుగ్ టన్నెల్‌లో మంచు తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణం అనుకూలించి రోడ్లు క్లియర్ అయ్యే వరకు ప్రయాణికులు అనవసర ప్రయాణాలు చేయవద్దని
మంచు కురుస్తుండటంతో దాదాపు 200 వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. రోడ్లపై మంచును తొలగించే పని జరుగుతోంది. ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
హిమపాతం కారణంగా శ్రీనగర్ రోడ్లపై దట్టమైన మంచు పరుపులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనాలు నడిపేందుకు సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా తెల్లదనం మాత్రమే కనిపిస్తుంది.