Trigrahi Yog: 64 ఏళ్ల తర్వాత త్రిగ్రహి యోగం.. అదృష్టం ఈ రాశుల వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది.. మీరున్నారా..?
జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషిని ఉఛ్చస్థితికి తీసుకెళ్తాయి. ఈ సమయంలో వీళ్లు చేసే పనులన్ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. ఎదురుండదు. అంతే కాకుండా.. జీవితంలో సెటిల్ మెంట్ ఏర్పడుతుంది.
మరో రెండు రోజుల్లో అంటే.. గురువారం రోజున 24న త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగ ధనలాభంతో పాటు అన్నిరకాల శుభఫలితాలు కల్గనున్నాయి.
ముఖ్యంగా ద్వాదశ రాశులపైకూడా దీని ప్రభావం ఉండబోతుందని పండితులు చెబుతున్నారు. బుధుడు, శని, శుక్రుడు కలవడం వల్ల ఈ త్రిగ్రహి యోగం ఏర్పడనుంది.
ధనస్సు ఈ రాశి వారికి ఈ యోగం వల్ల వ్యాపారాలలో, రియల్ ఎస్టేట్ రంగంలో అధికంగా లాభాలు కల్గనున్నాయి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది.
కుంభం.. ఈ రాశివారికి త్రిగ్రహి యోగం వల్ల.. చేపట్టిన పనులు ఆగకుండా పూర్తవుతాయి. లాటరీలు తగిలే చాన్సులు కూడా ఉన్నాయి. అంతే కాకుండా.. పెళ్లి యోగం కూడా కల్గనుంది.
కర్కాటకం..ఈ రాశివారికి త్రిగ్రహి యోగం వల్ల కొత్తగా ఇళ్లను కొనుగోలు చేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభంకు అవకాశాలు కన్పిస్తున్నాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. తండ్రి వైపు నుంచి వివాదాల్లో ఉన్న ఆస్తులు మీకు సొంతమౌతాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)