Tripti Dimri: రాబందుల్లా పీక్కుతిన్నారు.. ఆ బాధ వర్ణించలేను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన యానిమల్ బ్యూటీ..!
సినీ ఇండస్ట్రీలో అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అదృష్టం ఎప్పుడు వరిస్తుందో తెలియదు. అలా చాలా రోజుల పాటు ఇండస్ట్రీలో శ్రమించి ఒక సినిమాతో పాపులారిటీ ని అందుకుంది త్రిప్తి డిమ్రి.
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో జోయాగా కనిపించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా రణబీర్ తో కలిసి చేసిన బెడ్రూమ్ సన్నివేశాలు ఈమెకు మరింత మంచి పేరు తీసుకొచ్చాయి.
అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు, బంధువులను ఈమె ఎలా పేస్ చేస్తుందో అని బాలీవుడ్ మీడియా కూడా కోడై కూసింది. నిజానికి ఎనిమిదేళ్ల క్రితమే పోస్టర్ బాయ్స్ తో ప్రారంభమైంది ఈమె కెరియర్.. అయితే జనానికి ఈమె గురించి తెలియడానికి యానిమల్ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఒక దెబ్బతో సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.
ఇదిలా ఉండగా ఈమె మోడల్ సామ్ మర్చంట్ తో డేటింగ్ చేస్తోందనే పుకార్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కథనాలను బట్టి చూస్తే 2017 నుంచి అతడితో సన్నిహితంగా ఉంటోందని, త్వరలోనే అఫీషియల్గా తమ బంధాన్ని కన్ఫర్మ్ చేసి పెళ్లి పీటలు ఎక్కాలని భావిస్తున్నట్లు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి కీలక వ్యాఖ్యలు చేసింది. కెరియర్ మొదట్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారని, కానీ ధైర్యం చేసి ముంబైకి వచ్చానని, ఇక్కడ ఒకే గదిలో దాదాపు 50 మందితో కలిసి నివసించానని ఆమె తెలిపింది.
అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించలేదు. తిరిగి తల్లిదండ్రుల వెళ్దామనుకున్నప్పటికీ, ఆ బాధను నొప్పిని దిగమింగుకొని అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. ఈ సమయంలో బంధువులు, స్థానికులు రాబందుల్లా లేనిపోనివి మా తల్లిదండ్రులకు చెప్పారు .నాకు పెళ్లి కాదని, ఎవరు ముందుకు రారని లేనిపోనివి నూరి పోసారు . ఇలాంటి దశలో లైలా మజ్నులో అవకాశం దొరకడంతో నా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు అంటూ తెలిపింది త్రిప్తి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.