Aishwarya Rai: ఆ బోల్డ్ సీన్స్ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ మధ్య చిచ్చు పెట్టాయా..? ఇంతకు ఏం జరిగింది..?
అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తరువాత ఐశ్వర్య రాయ్ బి-టౌన్‌కి దూరమైంది. కొన్ని పెద్ద సినిమా ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించాల్సి వచ్చిందట.
బచ్చన్ ఫ్యామిలీకి కోడలు కావడంతో ఎలాంటి ఇంటిమేట్ సీన్స్‌లో నటించకూడదని కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఐశ్వర్యకు ఏ దిల్ హై ముష్కిల్ మూవీలో ఆఫర్ రాగా.. ఆమె నటించేందుకు ఒప్పుకుంది. కానీ బచ్చన్ కుటుంబం నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సినిమా కథ మొత్తం అభిషేక్ బచ్చన్‌కు చెప్పకుండా ఐశ్వర్య రాయ్ ఆ మూవీలో యాక్ట్ చేసింది.
ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత ఐశ్వర్య రాయ్ బోల్డ్ సీన్స్ భారీగా వైరల్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి కుటుంబంలో కలవరం మొదలైంది. ఈ విషయంపై అభిషేక్ సీరియస్ అయినా.. సర్దుకుపోయాడని టాక్ వచ్చింది.
ఇక జయా బచ్చన్, ఐశ్వర్య మధ్య దూరం పెరిగింది. అత్తాకోడళ్ల మధ్య అభిషేక్ బచ్చన్ మౌనంగా ఉండిపోయాడు.
తాజాగా విడాకుల వార్తల నేపథ్యంలో ఆ సినిమా నుంచే ఐశ్వర్యతో బచ్చన్ ఫ్యామిలీకి చెడిందని అంటున్నారు.