TSRTC Special Services: ఆవకాయ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. ఇక మీదట స్పెషల్ సర్వీసులు..
సమ్మర్ సీజన్ లో మామిడిపండ్లు ఎక్కువగా మార్కెట్ లోకి వస్తాయి. కొన్నిమామిడి పండ్లు రసాలకు చెందినవి ఉంటాయి. మరికొన్ని తియ్యటి,చప్పటి మామిడిపండ్లు ఉంటాయి. కాయగా ఉండే మామిడి పండ్లతో చాలా మంది ఆవకాయలు పెట్టుకుంటారు.
ఏడాదికి అవసరమైన ఆవకాయలను ఒకేసారి వేసుకుంటారు. వీటిలో పచ్చడి, చప్పటి ఆవకాయ, కారం ఆవకాయ, మాగాయి వంటి అనేక విధాలుగా ఉంటుంది. దీనిలో ఉప్పు ఎక్కువగా వేయడం వల్ల ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువమంది ఎండకాలంలో చేసుకుంటారు.
అందరికి మామిడి కాయలతో ఆవకాయచేసుకొవడం అస్సలు రాదు. దీంతో చాలా మంది ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారు ఆవకాయ వేసుకుంటారు. ఇలాంటి వారు.. తమ బంధువులకు, స్నేహితులకు ఆవకాయలను పార్శీల్ లను పంపిస్తారు. మామిడిని సాంబార్, కర్రీలలో కూడా వేసుకుంటారు.
మామిడి కాయలతో ఆవకాయ వేయడంను కొందరు బిజినెస్ గా చేసుకుంటారు. ఇలాంటి క్రమంలో.. దూర ప్రాంతంలో ఉన్న వారు ఎలా చేరవేయాలో కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈక్రమంలోనే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ మంచి సదుపాయం కల్పించారు.
రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు #TSRTC ద్వారా సులువుగా పంపించుకునే సౌకర్యం కల్పించారు. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది.
తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంది. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించవచ్చని ఆర్టీసీ అధికారులు ఒకప్రకటనలో వెల్లడించారు.