Tirumala News: తిరుమల వీఐపీ భక్తులకు బిగ్ షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొవడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వస్తున్నారు. వెంకన్నను దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఎన్నిగంటలైన వేచీచూసి తమ దేవుడిని ఒక్కసారి కళ్లరా చూసుకుని, స్వామి వారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. ఇటీవల సమ్మర్ హలీడేస్ వరుస సెలవులు నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున పొటేత్తారు. అంతేకాకుండా.. దీంతో కంపార్ట్ మెంట్ లని నిండిపోయి దాదాపు మూడు కిలో మీటర్ల మేరలో భక్తులు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.
సర్వదర్శనం కోసం భక్తులకు 20,నుంచి 30 గంటల పాటు సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా తిరుమల క్యూలైన్ లలో వేచీ ఉన్న భక్తులకోసం ప్రత్యేకంగా ఆహానం, నీళ్లు అందిస్తున్నారు. అయిన కూడా భక్తులు తాకిడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు వీఐపీ బ్రేక్‌ను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సమ్మర్ సెలవుల యాత్రికుల రద్దీ తారాస్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.
సర్వ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇప్పటికే దాదాపు 30-40 గంటల సమయం పడుతుండడంతో, సాధారణ యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ఈ నిర్ణయం తీసుకునట్లు సమాచారం.
అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.