Tirumala: ఒక్కరోజులోనే తిరుమల దర్శనం.. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే..
తిరుమల శ్రీవారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటారు. ఆయనను పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. ప్రతిరోజు కూడా దేశ,విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఎంటసేపైన క్యూలైన్ లలో వేచీచూసి స్వామి వారి దర్శనం కోసం పరితపిస్తుంటారు.
శ్రీవారిని కళ్లరా చూసుకుని తరిస్తుంటారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో ప్రతిఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. దేవలోకం నుంచి దేవుళ్లు భూమి మీదకు వచ్చారా.. అన్న విధంగా తిరుమలలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన నేల తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ విడుదల అయింది.
టీటీడీ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. శ్రీవారికి ఏయే తేదీల్లో ఎలాంటి సేవలు, ఉత్సవాలు, వాహాన సేవలు ఉంటాయో వెల్లడించింది. మెయిన్ గా తిరుమల బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.
బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో తెలిపారు. అదే విధంగా స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రం దర్శనం అవకాశం ఉంటుందని శ్యామల్ రావు తెలిపారు.
అదే విధంగా..గరువ సేవలు జరిగే అక్టోబరు 8 న మాత్రం అన్ని రకాల సేవలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. దాని కోసం ముందుగానే బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రతిరోజు బ్రహ్మోత్సావల నేపథ్యంలో.. భక్తుల కోసం.. 1.32 లక్షల టికెట్లను ఆన్ లైన్ లలో టికెట్ లను ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వ దర్శనానికి రోజుకు.. 24 వేల టోకెన్లు ఇవ్వనున్నారు.ప్రతిరోజు ఉదయం సుమారు 80 వేలు, గరుడ సేవనాడు లక్షల మంది దర్శనం చేసుకునే వీలుకల్పించారు.
తిరుమలలో ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని టీటీడీ భావిస్తుంది.మెయిన్ గా సామాన్యభక్తులకు దర్శనంకు ఇబ్బంది కల్గకుండా టీటీడీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైకి వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించినట్లు సమాచారం. అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ప్రతిరోజు బ్రహ్మోత్సావల నేపథ్యంలో.. భక్తుల కోసం.. 1.32 లక్షల టికెట్లను ఆన్ లైన్ లలో టికెట్ లను ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వ దర్శనానికి రోజుకు.. 24 వేల టోకెన్లు ఇవ్వనున్నారు.ప్రతిరోజు ఉదయం సుమారు 80 వేలు, గరుడ సేవనాడు లక్షల మంది దర్శనం చేసుకునే వీలుకల్పించారు.