Union Budget 2021: Nirmala Sitharaman ప్రవేశపెట్టనున్న కేంద్ర Budget 2021 ముఖ్యాంశాలు

Sun, 31 Jan 2021-6:34 pm,

Budget 2021 Date And Time: కరోనా వైరస్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దేశమంతా తాజా బడ్జెట్‌పై ఆసక్తికగా ఎదురుచూస్తోంది.

Also Read: Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు. తీవ్రమైన మాంద్యం మరియు తీవ్రమైన నిరుద్యోగ రేటు, ఎన్నో రంగాలలో పరిస్థితి దిగజారుతోంది. కేంద్ర బడ్జెట్ 2021(Union Budget 2021)లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు.

ఫిబ్రవరి 1, 2021న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశానికి ముందు భారత ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ శుక్రవారం ఆర్థిక సర్వేను సమర్పించారు.

Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మూడో బడ్జెట్ ఇది. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో సీతారామన్ తన మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మోదీ తొలిసారి అధికారం చేపట్టడానికి ముందుగా ఫిబ్రవరి చివరి దినానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. కాగా, మోదీ గత ప్రభుత్వం నుండి ఫిబ్రవరి మొదటి పని దినాన కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు.

To Watch The Budget Session 2021 Live: ఫిబ్రవరి 1, 2021 సోమవారం 11 గంటలకు బడ్జెట్ సెషన్ 2021ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. జీ న్యూస్ వంటి పలు జాతీయ మీడియా ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. కొన్ని ప్రభుత్వ అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో బడ్జెట్ 2021 లైవ్ సెషన్‌ను చూడవచ్చు.

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన

కరోనా మహమ్మారి నేపథ్యంలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను కాగిత రహితం(Paperless Budget 2021)గా ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్19 కారణంగా బడ్జెట్ పత్రాలను ముద్రించకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించడం తెలిసిందే. ఇది చారిత్రాత్మక చర్య, ఎందుకంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ పత్రాలు ముద్రించలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link