Mahesh Babu Baldhead Revealed: అయ్యయ్యో మహేష్ బాబుది విగ్గా.. రియల్‌ హెయిర్‌ కాదా?

Sun, 25 Feb 2024-6:37 pm,

మరి కొంతమంది అయితే సినీ ప్రేక్షకులు నిత్యజీవితంలో అనుసరిస్తున్న డైట్ పద్ధతులు.. స్కిన్ కలర్ రావడానికి అనుసరించే చిట్కాలను.. వారు ప్రతి రోజు ఎలాంటి ఆహారాలను తీసుకుంటున్నారు?,  హెయిర్ స్టైల్ తో పాటు నిజమైన జుట్టా కాదా? అని తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.   

అయితే ప్రస్తుతం చాలామందికి కొంతమంది హీరోలు విగ్గు వినియోగిస్తున్నారని అనుమానం కూడా వచ్చి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ హీరో మహేష్ బాబుది నిజమైన జుట్టేనా? లేదా విగ్గా అనే అనుమానం చాలామందికి వచ్చింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ గా పనిచేసిన మాధవరావు..  

గతంలో సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం తర్వాత ఆయన మేకప్ మ్యాన్ చేబ్రోలు మాధవరావు కొన్ని యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో ఒరిజినల్ జుట్టుతోనే నటించేవారా అనే యాంకర్ అడిగిన ప్రశ్నకు మేకప్ మ్యాన్ సమాధానం చెప్పారు.

గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఒరిజినల్ జుట్టుతోనే నటించేవారని.. పోను పోను ఆయన జుట్టు పల్చబడడంతో విగ్గును వినియోగించడం ప్రారంభించారని చేబ్రోలు మాధవరావు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యాంకర్ హీరో మహేష్ బాబు జుట్టు గురించి కూడా కొన్ని ప్రశ్నలను అడిగింది.

హీరో మహేష్ బాబు జుట్టు గురించి అడిగిన ప్రశ్నలకు చేబ్రోలు మాధవరావు ఇలా సమాధానం చెప్పుకొచ్చాడు.. "మహేష్ బాబు ఎప్పటినుంచో విగ్గును వినియోగించుకున్నారని, మొదట ఆయన గత కొన్ని సంవత్సరాల పాటు విగ్గు లేకుండా నటించినప్పటికీ జుట్టు పరచబడటంతో విగ్గు ధరించి నటించారని" అన్నారు.

మహేష్ బాబు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నారని సమాచారం. కొత్త టెక్నాలజీ తో కూడిన క్యూ6 హెయిర్ ప్యాచ్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా మహేష్ బాబు తలమీద జుట్టును ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారని తెలుస్తోంది. హీరో మహేష్ బాబు ఏ కాకుండా బాలీవుడ్ లో కూడా అనేకమంది సెలబ్రెటీలు ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు.

(ఇది పాత ఇంటర్వ్యూ. రీసెంట్ గా నెట్టింట వైరల్ అవుతోంది.. Zee Telugu News ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link