Unstoppable Season 4: డాకూ మహారాజ్ తో వెంకీ మామ.. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో వెంకటేష్..
Venky Mama In Balakrishna Unstoppable Season 4: బాలకృష్ణ హీరోగానే కాకుండా అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ షోలో వెంకీ మామ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. దానికి సంబంధించిన షూట్ కంప్లీట్ అయింది.
వెంకటేష్.. ఒకప్పటి టాప్ అగ్ర హీరోల్లో ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తర్వాత స్థానం వెంకటేష్ దే. నిన్నటి తరం అగ్ర హీరోల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాదు వెంకటేశ్ కూడా అప్పట్లో బాలయ్యతో పలమార్లు సంక్రాంతి సహా ఇతర సీజన్లలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన సందర్భాలున్నాయి.తాజాగా రాబోతున్న ఈ ఎపిసోడ్ లో వెంకటేష్ తో బాలయ్య ముచ్చట్లు ఎలా ఉండబోతున్నయనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇద్దరు హీరోలు తమ సినిమాలకు సంబంధించిన అంశాలతో పాటు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన సినిమాల గురించి ఎలాంటి ఏ విధంగా చర్చలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోల్లో బాలకృష్ణ, వెంకటేష్ మధ్య మంచి రాపో ఉంది.
వీళ్లిద్దరు ఎన్నో సార్లు పలు సందర్భాల్లో కలిసిన ఉదంతాలున్నాయి. రీసెంట్ గా బాలయ్య సినీ స్వర్ణోత్సవంలో చిరుతో కలిసి ఎంతో ఉత్సాహాంగా పాల్గొన్నారు. ఈ షోలో వీళ్లిద్దరు కలిసి ఏదైనా మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మరి వీళ్లిద్దరు బాలకృష్ణ, వెంకటేష్ కలిసి అన్ స్టాపబుల్ షో వేదికగా మల్టీస్టారర్ మూవీని అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.
అంతేకాదు రాబోయే సంక్రాంతి బరిలో బాలయ్య..బాబీ దర్శకత్వంలో ‘డాకూ మహారాజ్’గా పలకరిస్తూ ఉంటే.. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పలకరించబోతున్నారు. వీళ్లిద్దరితో పాటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో సంక్రాంతి బరిలో సై అంటున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ బరిలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది చూడాలి.