Upsana: పెళ్లిచూపుల్లో ఉపాసన.. చరణ్‌ను అడిగిన ఆ ప్రశ్నకు చిరు సైతం నోరెళ్లబెట్టారట.. నెట్టింట రచ్చ చేస్తోన్న ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా?
ఉపాసన కొణిదెల ఈమె అపోలో హెడ్ ప్రతాప్ గారి మనువరాలు. అంతేకాదు ఈమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళ. రామ్ చరణ ఉపాసనలు ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితులుగా మెలిగారు. ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది.
ఇరు కుటుంబాలను ఒప్పించారు. ఇక పెళ్లిచూపులు కూడా ఏర్పాటు చేశారు. అయితే, రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి చూపులు చాలా ఫన్నీగా సాగాయట. ఉపాసన చెర్రీని పెళ్లిచూపుల్లో భాగంగా ఓ ప్రశ్న అడిగిందట. ఇది విన్న చిరు ఒక్కసారిగా షాక్ అయ్యారట.
ఇంతకు ఉపాసన చెర్రీని అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? 'పెళ్లి తర్వాత ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు మీ అమ్మకా? నాకా?' అని అడిగిందట. ఇది విన్న చిరు నోరెళ్లబెట్టారట. దీనికి చరణ్ మాత్రం చాలా తెలివిగా జవాబు ఇచ్చాడట.
చరణ్ మాత్రం ఉపాసన ప్రశ్నకు జవాబు ఇస్తూ ' తల్లిని ప్రేమించిన ప్రతి మగాడు భార్యను ప్రేమిస్తాడు, ఆమెనే ఎక్కువగా ఇష్టపడతాడు' అని చాలా తెలివిగా జవాబు ఇచ్చాడట. దీంతో పక్కను ఉన్నవారు అంతా క్లాప్స్ కొట్టారట. ఇలా ఆసక్తికరంగా చరణ్ ఉపాసనల పెళ్లిచూపులు జరిగాయి. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక రామ్ చరణ్ ఉపాసనలకు 11 ఏళ్ల తర్వాత క్లీంకార జన్మించింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ డిసెంబర్‌లో విడుదలకు సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమాలో కియారాతో చెర్రీ మరోసరి జత కడుతున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.