Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు, యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్.. డిటెయిల్స్ ఇవే..
మహరాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఆమె పూణేలో ట్రైనింగ్ లో వివాదాస్పదంగా ప్రవర్తించారు. అంతేకాకుండా.. ఆమె అనేక నకిలీ సర్టిఫికేట్లను యూపీఎస్సీకి సబ్మిట్ చేసి జాబ్ ను పొందినట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ఆమెపై యూపీఎస్సీ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఆమె యూపీఎస్సీలో నకిలీ పత్రాలను సబ్మిట్ చేసినట్లు యూపీఎస్సీ గుర్తించింది. అలాగే యూపీఎస్సీ అభ్యర్థిత్వంను కూడా రద్దు చేస్తున్నట్లు తెల్చి చెప్పింది. భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లు సైతం రాయకుండా ఉండేందుకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది.
పూణేలో ట్రైనింగ్ లో ఉండగా.. కలెక్టర్ లేనప్పుడు ఆయన గదిలోకి ప్రవేశించడం, ప్రభుత్వ వసతులు కావాలని డిమాండ్ చేయడం వంటి ఘటనల వల్ల ఆమె వార్తలలో నిలిచారు. పూణే కలెక్టర్ పూజా ఖేడ్కర్ వ్యవహారాన్ని సీఎస్ కు, ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో ఆమెపై దర్యాప్తు ప్రారంభమైంది.
పూజా ఖేడ్కర్ సమర్పించిన అనేక సర్టిఫికేట్లు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని కూడా యూపీఎస్సీ గుర్తించింది. ఆమె తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటో గ్రాఫ్, సంతకం, ఈమెయిల్స్, అడ్రస్ లను ప్రతి దానిలో కూడా మోసపూరితంగా వ్యవహరించినట్లు యూపీఎస్సీ గుర్తించింది.
పూజా తల్లిదండ్రులు సైతం అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పూజా ఖేడ్కర్ ఏకంగా.. చోరీ కేసులో దొంగను విడిచిపెట్టాలని పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చిన ఘటనలు సైతం వెలుగులోకి వచ్చాయి.
పూణేలో మున్సిపాలిటి నిబంధలనకు విరుద్ధంగా ఇల్లును నిర్మించింది. అధికారులు నోటీసులను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇటీవల అధికారులు ఇటీవల పూజా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా, యూపీఎస్సీ ఆమెను డిబార్ చేయడం, పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.