Vaishaka Amavasya 2024: మరో రెండు రోజుల్లో వైశాఖ అమావాస్య.. ఈ పనులు చేస్తే మీ లైఫ్ లో ఊహించని జాక్ పాట్..
హిందూ ధర్మాల ప్రకారం ప్రతిఒక్క తిథికి ఒక్కొ ప్రాముఖ్యత ఉంది. మే నెలలో ఎనిమిదో తేదీన అమావాస్య వస్తుంది. ఈరోజున వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్యగా పిలుస్తుంటారు. ఈరోజు కొన్నినియమాలు పాటిస్తే జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు.
మనలోచాలా మంది అమావాస్యను మంచిది కాదని భావిస్తారు. కానీ దీపావళి తిథిని మనం అమావాస్యరోజు పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి గెలిచిన దానికి గుర్తుగా దీపావళి చేసుకుంటాం. అదే విధంగా చీకటిని తొలగించి మన జీవితంలో వెలుగులు నింపుతుంది. అమావాస్య రోజున పితృకార్యక్రమాలు చేస్తే ఎలాంటి దోషాలున్న పరిహారమవుతాయని చెప్తారు.
చాలా మంది యువత జీవితంలో తొందరగా ఉద్యోగంలో స్థిరపడరు. ఉద్యోగం వచ్చిన కూడా అంతగా సాటిస్ ఫై కారు. చేస్తున్న పనిలో పురోగతి ఉండదు. ఎంత ప్రయత్నం చేసిన పెళ్లి కాదు. పెళ్లి జరిగితే పిల్లలు పుట్టరు. ఇలా జీవితంలో అనేక సమస్యలు ఎదురౌతుంటాయి. వీటిని పితృ దోషం కారణమని కూడా చెబుతుంటారు.
అందుకే అమావాస్య రోజున పితృదేవతలకు, చనిపోయిన పూర్వీకులకు శ్రాధ్దకార్యక్రమాలు చేయాలి. నదీ స్నానం చేస్తే మనం తెలిసీ, తెలియక చేసిన పాపాలన్ని పరిహారమైపోతాయి. అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయాలి. ఈరోజున అశ్వద్ధ చెట్టుకింద దీపం వెలిగించాలి. నల్లచీమలకు చక్కెర ఆహారంగా పెట్టాలి. తెనే, ఆహార పదార్థాలను కాకులకు,కుక్కలకు ఆహారంగా పెట్టాలి.
అమావాస్య రోజున గుడిలో దీపారాధన చేయాలి. ఈరోజున ఇంట్లో ఏదైన స్వీట్ చేసి, పేదలకు పంచిపెట్టాలి. అమావాస్య రోజున ఉపవాసం ఉంటే, పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని చెబుతుంటారు. అమావాస్య రోజున అనాథశ్రమంకు వెళ్లి బట్టలు, స్వీట్లు పంచిపెట్టాలి.
వైశాఖ మాసం ఈ నెలలో ఎండలు మండిపోతుంటాయి. అందుకే ఈరోజున కుండలలో నీళ్లు లేదా నీటి వసతి ఏర్పాటు చేయాలి. చల్లని నీళ్ల ప్యాకెట్ లు, నీళ్ల బాటిళ్లను వీలైనంతా ఎక్కువ మంది దానంచేయాలి. చెప్పులు దానం చేసిన కూడా మంచి ఫలితం కల్గుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)