Varalaxmi Sarathkumar: ఈ యేడాదే నా పెళ్లి.. శబరి ప్రెస్‌ మీట్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Wed, 24 Apr 2024-3:06 pm,

'శబరి' ప్రయాణం ఎప్పుడు,  ఎలా మొదలైంది? 'క్రాక్'కు సంతకం చేయడానికి ముందు 'శబరి' కథ విన్నాను.  నాకు స్టోరీ బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. అయితే, షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది. టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్త పాత్ర చేశాను. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది.

దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు... ఈ సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా? జీవితమే పెద్ద రిస్క్ అండీ. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. 'హనుమాన్' చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్ అయ్యింది. 'నాంది', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది.

కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు? 'శబరి' ప్రెస్‌మీట్‌ చూస్తే అందరూ నిర్మాత గురించి మాట్లాడారు. ఎందుకంటే... ఆయన మంచి మనిషి. ఎవరినీ చీట్ చేసే మెంటాలిటీ లేదు. అడగక ముందు పేమెంట్ వస్తుంది. బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమా పూర్తి చేశారు.గణేష్ వెంకట్రామన్ సినిమాలో మీకు అపోజిట్ క్యారెక్టర్ చేశారా? మీ మధ్య యాక్షన్ సీన్లు ఉన్నాయా? సినిమాలో చూడండి. స్క్రీన్ ప్లే డ్రివెన్ సినిమా 'శబరి'. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ మూవీ నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి.

యాంగ్రీ విమన్ రోల్స్, హీరోతో ప్యారలల్ రోల్స్ చేస్తున్నారు. ఈ సమయంలో తల్లి పాత్ర అంటే ఎలా ఫీలయ్యారు? నా తొలి సినిమా 'పొడా పొడి'లో తల్లి పాత్రలో నటించాను. 'పందెం కోడి 2'లో చేశాను. నేను ఓ నటిని. నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్ వంటివి పట్టించుకోను. సినిమాలో ప్రేక్షకులకు ఏం చూపిస్తే అది యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు.

'శబరి' సినిమాలో మీ రోల్ ఏమిటి? ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్? యాంగ్రీ యంగ్ లేడీ కాదు. ఓ సాధారణ అమ్మాయి. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. ఆమెకు ఏమైంది? అనేది కథ. హిట్టూ ఫ్లాపులు నా చేతుల్లో లేవు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. ప్రేక్షకులు నచ్చే విధమైన నటన ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఆమె పెర్ఫార్మన్స్ బాలేదని అనుకోకూడదు.

పెళ్లి ఎప్పుడు? ఈ ఏడాది ఉంటుంది. త్వరలో ఆ శుభవార్తను చెబుతాను. త్వరలో 'కూర్మ నాయకి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  తమిళంలో ధనుష్ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాను. కన్నడలో సుదీప్‌తో 'మ్యాక్స్' చేశాను. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.  కన్ఫార్మ్ అయ్యాక ఆ వివరాలు చెబుతాను.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link