Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే క్షణాల్లో ఇళ్లు గుల్లవడం ఖాయం, జాగ్రత్త
దూది చెట్టు
ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో దూది లేదా కాటన్ మొక్క కూడా మంచిది కాదు. చాలామంది తెలియక ఇంటి ఆవరణలో పెంచుకుంటారు. కానీ దీనివల్ల ఆ ఇళ్లు మొత్తం గుల్లవుతుంది.
పాలు కారే మొక్కలు
కొన్న రకాల మొక్కల్ని తెంచితే పాలలాంటి ద్రవం కారుతుంటుంది. ఇలాంటి మొక్కలు పెంచడం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంచిది కాదు. ఇంట్లో పూర్తిగా నెగెటివ్ శక్తి ప్రసరిస్తుంది.
కాక్టస్ మొక్క
చాలామంది ఇంట్లో లేదా ఇంటి పైకప్పుపై కాక్టస్ మొక్కలు పెంచుకుంటుంటారు. చూసేందుకు అందంగా ఉన్నా వాస్తురీత్యా ఇవి అశుభంగా భావిస్తారు. ఇవి కూడా ముళ్ల జాతికి చెందినవి కావడం మంచిది కాదు
బబుల్ మొక్క
వాస్తు నిపుణుల ప్రకారం ముళ్లున్న మొక్కలు గానీ చెట్లు గానీ ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉండటం మంచిది కాదు. వీటి వల్ల ఆ ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇందులో ఒకటి బబుల్ మొక్క. ఈ మొక్కను అశుభంగా భావిస్తారు. ఈ మొక్క వల్ల ఇంటి యజమాని సంపాదనపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
చింత చెట్టు
జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో చింతచెట్టు ఉండటం మంచిది కాదంటారు. ఇంట్లో చింత మొక్క ఉండటం అంటే ఆ ఇంట్లో నెగెటివ్ శక్తి ప్రసరిస్తుందని అర్ధం. ఒకవేళ చింత చెట్టు ఉంటే వెంటనే తొలగించండి.