Venkatesh: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా..
రీసెంట్ గా వెంకటేష్ తన కెరీర్ లో లాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందనుకున్న ‘సైంధవ్' మూవీ సంక్రాంతి పోటీలో నలిగిపోయింది. ఈ సినిమా తర్వాత తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు శిరీష్,అనిల్ రావిపూడితో పాటు వెంకటేష్ సోదరుడు నిర్మాత సురేశ్ బాబు, కే.రాఘవేంద్రరావు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో సినిమా స్క్రిప్ట్ ను వంశీ పైడిపల్లి దర్శకుడు అనిల్ రావిపూడికి అందజేశారు.
అంతేకాదు వెంకటేష్, మీనాక్షి చౌదరిలపై తొలి సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
డి.సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేస్తే.. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాలో చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు పెళ్లాల మధ్య నలిగే పోలీస్ భర్త పాత్రలో కనిపించనున్నాడట. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.