Vijay Devarakonda Top Movies: విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..
గీత గోవిందం.. (Geetha Govindam) విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ గీత గోవిందం. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
టాక్సీవాలా (Taxiwala) రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ టాక్సీవాలా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
అర్జున్ రెడ్డి.. (Arjun Reddy) విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తే అక్కడ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
పెళ్లి చూపులు (Pelli Chupulu)
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ పెళ్లి చూపులు. ఈ సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఎవడే సుబ్రహ్మణ్యం (Evade Subramanyam)
వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి.