Vinesh Phogat: రక్తం తీసి.. వెంట్రుకలను కత్తిరించుకుని.. కన్నీళ్లు తెప్పిస్తున్న వినేష్ ఫోగట్ విశ్వ ప్రయత్నాలు..
ఒలిపింక్స్ లో భారత్ కు ఊహించని షాక్ ఎదురైంది. భారతీయులంతా మరోసారి తమకు పతకం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాలుగు సార్లు వరల్డ్ నంబర్ వన్ రెజ్లర్ సుసాకిని ఓడించడంతో ఈసారి పసిడి ఖాయమని అందరు భావించారు.
ఈ నేథ్యంలో అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్ అనూహ్యంగా అనర్హత బారిన పడింది. ఇదిలా ఉండగా.. 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ ఈరోజు రాత్రి తలపడాల్సి ఉంది. ఈక్రమంలో ఒలింపిక్స్ నియమాల ప్రకారం క్రీడాకారులకు.. బరువులకు సంబంధించిన పలు టెస్టులు నిర్వహిస్తారు.
దీనిలో అనూహక్యంగా వినేష్ ఫోగట్ 100 గ్రాములు అధికంగా ఉండటం బైటపడింది. దీంతో ఆమె పోటీకి అనర్హురాలని కూడా ఒలింపిక్స్ సంఘం ప్రకటించింది. మరోవైపు సెమిస్ లో.. తలపడిన మరుసటి రోజు ఉదయానికి వినేష్ బరువు పెరగటంపై కూడా ఐఓసీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది.
తన బరువు తగ్గించుకునేందుకు మంగళవారం రాత్రి.. వినేష్ ఫోగట్ విశ్వప్రయత్నాలు చేశారంట. ఆమె తన రక్తాన్ని కూడా తీసుకొవడానికి ప్రయత్నించారంట. అంతేకాకుండా.. వెంట్రుకలను కూడా కట్ చేయించుకున్నారంట. అయిన కూడా ఆమె బరులో ఆశించినంత మార్పులు రాలేదు..
వినేష్ ఫోగట్ మంగళవారం రాత్రి ఒక కేజీ బరువు పెరిగింది. దీంతో ఆమె రక్తం తీసుకొవడం, వెంట్రుకలను కట్ చేసుకొవడం , రాత్రంతా ఎక్సర్ సైజ్, సైక్లింగ్.. వంటి చర్యల ద్వారా.. 900 గ్రాముల బరువును కోల్పోయింది. కానీ కేవలం 100 గ్రాములు మాత్రం తగ్గలేదు. దీంతో ఆ వంద గ్రాములు మాత్రం భారతీయుల కన్నీళ్లకు కారణమయ్యాయి.
దీంతో వినేష్ ఫోగట్ పడిన కష్టం అంతా నీరు కారిపోయింది. ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్ మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరమంతా డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.