Samyuktha Menon Pics: సెగలు రేపుతున్న సంయుక్త మీనన్.. సార్ బ్యూటీ అందాలకు కుర్రకారుకు కిక్కెక్కడం పక్కా!
కేరళ కుట్టి సంయుక్త మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సంయుక్త నాభి అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ యాక్టివ్‌గా ఉంటూ హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ అభిమానులతో పంచుకుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
సార్, విరూపాక్ష సినిమాలతో మంచి విజయాన్ని సంయుక్త మీనన్ అందుకున్నారు. వరుస విజయాలతో సంయుక్త క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి.
కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'తో సంయుక్త మీనన్ తెలుగులో ఇండస్ట్రీలోకి వచ్చినా.. 2022లో విడుదలైన 'భీమ్లా నాయక్' మొదటి సినిమాగా రిలీజయింది.
2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీ రంగానికి పరిచయయ్యారు.
1995 సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లో సంయుక్త మీనన్ జన్మించారు. చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసిన సంయుక్త.. ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.