Vishal Mega Mart IPO: నేడు విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ప్రారంభం..షేర్ ధరెంతంటే?

Wed, 11 Dec 2024-9:43 am,

Vishal Mega Mart IPO:  సూపర్ మార్కెట్ చైన్ ఆపరేటింగ్ కంపెనీ విశాల్ మెగా మార్ట్  IPO నేడు సబ్‌స్క్రిప్షన్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 11 బుధవారం ప్రారంభమయ్యే ఈ IPO డిసెంబర్ 13న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా విశాల్ మెగా మార్ట్ రూ.8000 కోట్లు సమీకరించబోతోంది.

రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు కంపెనీ తన ఐపీఓ ధరను రూ.74 నుంచి రూ.78గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక లాట్‌లో 190 షేర్లు ఇస్తుంది.  ఒక లాట్‌కి కనీసం రూ.14,820 పెట్టుబడి పెట్టాలి.  

ఈ IPOలో, రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్‌లు అంటే 2470 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం వారు మొత్తం రూ.1,92,660 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. విశాల్ మెగా మార్ట్  IPO కింద, QIB పెట్టుబడిదారులకు 50 శాతం, NII పెట్టుబడిదారులకు 15 శాతం  రిటైల్ పెట్టుబడిదారులకు 35 శాతం రిజర్వ్ చేసి ఉంటుంది.   

ఈ IPO పూర్తిగా OFS ఆధారితంగా ఉంటుందని, అంటే, ఈ IPOలో కంపెనీ ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయదు. ఈ IPO కింద, కంపెనీ ప్రమోటర్ సమయత్ సర్వీసెస్ LLP మొత్తం 1,02,56,41,025 షేర్లను జారీ చేస్తుంది. విశాల్ మెగా మార్ట్‌లో సమయత్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పికి 96.55 శాతం వాటా ఉంది. ఇది మెయిన్‌బోర్డ్ IPO అవుతుంది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్, BSE, NSE  రెండు ప్రధాన ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవుతుంది. 

డిసెంబర్ 18న కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతుంది. డిసెంబర్ 13 శుక్రవారం IPO ముగిసిన తర్వాత, డిసెంబర్ 16 సోమవారం నాడు షేర్ల కేటాయింపు జరుగుతుంది. డిసెంబర్ 17న ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలకు షేర్లు జమ అవుతాయి. చివరకు డిసెంబర్ 18వ తేదీ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ లిస్ట్ అవుతుంది.   

విశాల్ మెగా మార్ట్ ఎగువ దిగువ తరగతి, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి మధ్య విపరీతమైన రీచ్‌ను కొనసాగించింది. విశాల్ మెగా మార్ట్ రోజువారీ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ఒక స్టాప్ డెస్టినేషన్. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్ మార్కెట్ విలువ రూ. 35,168కోట్లు ఉంది. ఇతర రిటైల్ కంపెనీలతో పోల్చితే విశాల్ మెగామార్కెట్ ఐపీఓ ధరల శ్రేణి రీజనబుల్ గా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link