Heavy rainfall: తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ... వచ్చే ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు..
ఇరు తెలుగు స్టేట్స్ లలో రుతుపవనాలను చురుకుగా విస్తరించాయి. దీని ప్రభావం వల్ల వాతారణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొంత కాలంగా ఉక్కపోతతో.. అల్లాడిపోయిన జనాలు వర్షం కురుస్తుడంటంతో ఊరట లభించిందని భావిస్తున్నారు.
ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల కూడా తెలంగాణలో అనేక ప్రాంతాలలో వాతావరణం మారిపొయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీగావర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజాబామాద్,కరీంగనగర్, వరంగల్, ఖమ్మం,హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో భారీగా వర్షంకురుస్తుందని సమాచారం. ఇక కొమురంభీం, ఆసిఫాబాద్, ఇతర ప్రాంతాలలో బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఒకవైపు స్కూళ్లు తెరుచుకొన్న నేపథ్యంలో.. వర్షాలతో జనాలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోడ్లు కూడా గుంతల మయంగా ఉండటంతో కూడా జనాలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.
రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీగావర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణం కూడా ఇటు ఎండగా కాకుండా.. ఇటు వర్షం పడకుండా.. చల్లగా ఉంటుంది.
దీంతో చాలా మంది ప్రజలు ఈ చల్లని వాతావరణంలో తమ ఫ్యామిలీస్ తో కలిసి టూర్ లకు ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో ఉండే ప్రజలు.. చల్లని వాతావరణంకు నగర శివారులు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లి కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు.