Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 3 రోజులపాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు..
గత నెలల నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ప్రధాన జిల్లాల్లో వర్షాలు కురవడంతో పాటు చెన్నైలో కూడా బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈనెల 11వ తేదీలోగా మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రేపటిలోగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఇవి పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో సోమవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు మిగతా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఈ సందర్భంగా మత్స్యకారులను వేటకు వెళ్ళకూడదని అలర్ట్ చేసిన వాతావరణ శాఖ.
ఇక తెలంగాణలో కూడా తేలిక పాటలు పాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయిన సంగతి తెలిసిందే. పగటిపూట ఎండ నమోదు అయిన రాత్రిపూట ఉష్ణోగ్రతలు చల్లబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక ఈ ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేకంగా నెల్లూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. తీర ప్రాంత ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ నెలలో ఎక్కువ శాతం తుఫానులు వచ్చే అవకాశం ఉంది.