Hyderabad Rains: హైదరాబాద్ ను కమ్మేసిన నల్లని మేఘాలు.. పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వర్షం..
తెలంగాణలో ఒక వైపు రుతుపవనాలు మరోకవైపు ఉపరిత్ర ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాలో భారీ నుంచి అతిభారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాలలో బలంగా గాలులు వీస్తున్నాయి.
ఇక మరోవైపు వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వర్షంపై పలు అలర్ట్ ను జారీచేసింది. ప్రస్తుతం.. ఉపరిత ద్రోణి ఒకటి తెలంగాణ నుండి మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1కి. మీ. మరియు 5.8 కి. మీ మధ్యలో విస్తరించి ఉన్నది.
ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నవి. దీని ప్రభావం వల్ల.. రాగల 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు ప్రభావంలో.. గంటకు 30 నుండి 40 కి. మి ఈదురు గాలులతో కూడిన మొస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వాతావరణ కేంద్రం అంచనాలకు తగ్గట్టునే తెలంగాణాలోని అనేక ప్రాంతాలలో వర్షం కురుస్తుంది.
హైదరాబాద్ లో ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. లింగంపల్లి, చందానగర్, కూకట్ పల్లి, సోమాజీ గుడా, అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, జీయాగూడ, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, తార్నక , హైటేక్ సిటీ, నానక్ రామ్ గూడ, వంటి అనేక ప్రాంతాలలో కొన్ని గంటలుగా భారీగా వర్షం కురుస్తుంది.
ఒకవైపు ఆఫీసుల నుంచి బైటకు వచ్చే సమయం, మరోవైపు స్కూళ్లుకూడా తెరుచుకున్న నేపథ్యంలో.. వర్షంతో రోడ్డుపైన విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా అనేక చర్చలుచేపట్టారు. అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దని అధికారులు సూచిస్తున్నారు.