Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్
Web WhatsApp Security Features: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) వెబ్ వాట్సాప్ లాగిన్(Web WhatsApp Login) కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ వెబ్ వాట్సాప్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినట్లు వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్‌ను కంప్యూటర్‌కు లింక్ చేయడానికి ముఖం లేదా బయోమెట్రిక్ స్కానింగ్ ఫీచర్‌ను సిద్ధం చేసింది.
Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) గతంలో తెచ్చిన ఫీచర్లకు భిన్నంగా కొత్త సెక్యూరిటీ ఫీచర్ సిద్ధం చేసింది. ప్రైవసీ పాలసీ వివాదం నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వాట్సాప్ వెబ్ లాగిన్(Web WhatsApp Login)లో ఇప్పుడు ముఖం(Face ID) లేదా బయోమెట్రిక్(Fingerprint) స్కానింగ్ ఫీచర్ లాంచ్ చేయనుంది.
వెబ్ వాట్సాప్ వెర్షన్‌లో వేలిముద్రతో భద్రత అందుబాటులోకి రానుంది. దీంతో మీరు తప్ప మరెవరూ మీ వెబ్ వాట్సాప్‌నకు లాగిన్ సాధ్యం కాదు. ఇప్పటివరకు QR కోడ్‌ను నేరుగా వాట్సాప్-వెబ్ వాట్సాప్ ద్వారా స్కాన్ చేయడం ద్వారా వెబ్ లాగిన్ అవుతున్నాం. కానీ ఇకనుంచి అది జరగదు.
Also Read: How To Secure Whatsapp Chat: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్
క్యూఆర్ కోడ్(QR Code) స్కాన్ చేయడానికి ముందు ఫోన్‌ను ఫింగర్ ప్రింట్ ద్వారా అన్‌లాక్ చేయాలి. లేకపోతే ఫేస్ స్కాన్( Face ID) కోసం మరో చాయిస్ కూడా ఉంటుంది. వాట్సాప్ తన వినియోగదారుల డేటా గోప్యత మరియు భద్రతకు సంబంధించి ఈ ఫీచర్‌ను తయారు చేసింది.
Also Read: WhatsApp Delays New Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్
మునుపటి కంటే మరింత సురక్షితమైన మరియు మార్చగల డిజైన్ వెబ్ వాట్సాప్‌లో లాగిన్ అయ్యే ఈ ప్రక్రియ గతంలో కన్నా మరింత సురక్షితంగా మరియు వేగంగా ఉంటుంది. ఇది కాకుండా, వెబ్ వాట్సాప్ డిజైన్ కూడా మార్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి. వాట్సాప్ ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది.