How To Secure Whatsapp Chat: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్

  ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ. ఫిబ్రవరి నుంచి మన డేటాను దాని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ ఇవ్వబోతుందని ఆందోళన నెలకొనడంతో మే 15 వరకు కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

How To Secure Whatsapp Chat, Photos and Videos:  ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ. ఫిబ్రవరి నుంచి మన డేటాను దాని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ ఇవ్వబోతుందని ఆందోళన నెలకొనడంతో మే 15 వరకు కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

1 /6

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ(WhatsApp Privacy Policy). ఫిబ్రవరి నుంచి మన డేటాను దాని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ ఇవ్వబోతుందని ఆందోళన నెలకొనడంతో మే 15 వరకు కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

2 /6

ఆ విషయాన్ని పక్కనపెడితే మీరు వాట్సాప్(WhatsApp)‌ను జాగ్రత్తగా వాడుతున్నారా.. లేక మీ వాట్సాప్ ఫొటోస్, ఛాటింగ్ వివరాలు, వీడియోలు ఎవరైనా చూస్తున్నారా అని ఏమైనా అనుమానం ఉందా. అయితే వెంటనే ఈ 3 సెట్టింగ్స్ మార్చేస్తే చాలు. మీ వాట్సాప్ డేటా సేఫ్‌గా ఉంటుంది. Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..

3 /6

వాట్సాప్‌లో వ్యక్తిగత వివరాలు, ఆఫీసు ఫైల్స్ కూడా షేర్ చేస్తుంటాం. కనుక టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫీచర్ ఆన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి కుడివైపు పైభాగంలో ఉన్న త్రీ డాట్స్‌ మీద క్లిక్ చేయాలి. తరువాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అక్కడ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో Two-step-verification పైన క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది.

4 /6

ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ఓపెన్ అయ్యాక 6 అంకెల పిన్ నెంబర్ సెట్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా అప్‌డేట్ చేయాలన్నా టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి. దీంతో హ్యాకర్స్ సైతం మీ వాట్సాప్‌ను అంత ఈజీగా హ్యాక్ చేయలేరు. Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్

5 /6

ఫింగర్‌ప్రింట్ ‌లాక్(Fingerprint Lock) ఫీచర్‌ను వాట్సాప్‌లో యాక్టివేట్ చేయాలి. ఇందుకోసం మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కుడివైపు పైభాగంలో ఉన్న త్రీ డాట్స్‌ మీద క్లిక్ చేయాలి. తరువాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అందులో ప్రైవసీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న Fingerprint Lock ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన

6 /6

ఫింగర్‌ప్రింట్ ‌లాక్, టూ స్టెప్ వెరిఫికేషన్‌ ఫీచర్లతో పాటు మెస్సేజ్ డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌ను కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఆ ఫీచర్ యాక్టివేట్ చేస్తే వారం రోజుల తర్వాత మీ వాట్సాప్ ఛాటింగ్, ఫొటోలు, వీడియోలు ఇందులో రిమూవ్ అయిపోతాయి. ఫొటోలు, వీడియోలు అయితే మీ గ్యాలరీలో సేవ్ అవుతాయి.