Garlic Reduces Belly Fat: వెల్లుల్లితో ఈ 5 రకాలుగా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే మాయం
వెల్లుల్లి రసం
4-5 వెల్లుల్లి రెమ్మల రసం తీసి అందులో ఒక స్పూన్ తేనె కలిపి పరగడుపున తాగాలి. ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది.
వెల్లుల్లి ఆయిల్
వెల్లుల్లి ఆయిల్ చర్మానికి రాయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. రోజూ రాత్రి వేళ పడుకునేముందు వెల్లుల్లి నూనెతో మసాజ్ చేసుకోవాలి.
వెల్లుల్లి సూప్
సూప్‌లో వెల్లుల్లి వేయడం వల్ల రుచే మారిపోతుంది. బరువు తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ఏ సూప్‌లోనైనా కలిపి తీసుకోవచ్చు
వెల్లుల్లి టీ
ఓ కప్పు వేడి నీటిలో 2-3 వెల్లుల్లి రెమ్మలు దంచి వేయాలి. ఓ 5 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత వడకాచి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిది.
పచ్చి వెల్లుల్లి తినడం
ఉదయం లేవగానే పరగడుపున 2-3 వెల్లులి రెమ్మలు పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చివి తినలేకుంటే నీళ్లతో మింగవచ్చు. లేదా నచ్చిన కూరలో కలిపి తినవచ్చు.