Waking Up Early: రోజుకో యాపిల్ తింటేనే కాదు.. ప్రతిరోజూ ఉదయం 5గంటలకు ఈ పనిచేస్తే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు

Wed, 28 Aug 2024-9:37 pm,

Benefits of waking up early:ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచే అలవాటు మన పూర్వీకుల నుండి వచ్చిన అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేవడం వల్ల శరీరం చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. 

బాడీ రిపేర్: నిద్రలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఉదయాన్నే లేవడం వల్ల ఈ మరమ్మతు ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు శక్తి లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేవడానికి ప్రయత్నించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

మెదడుకు ఆక్సిజన్: తెల్లవారుజామున వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో శ్వాస తీసుకోవడం వల్ల మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. దీంతో మన మెదడు చురుకుగా పని చేయడంతోపాటు  జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

 మెరుగైన జీర్ణక్రియ: ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే నిద్రలేవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. 

  కండరాల బలం: ఉదయం వ్యాయామం చేస్తే కండరాలు బలంగా ఉంటాయి. శరీరం చురుకుగా మారుతుంది. ఆరోగ్యకరమైన కండరాలను పొందవచ్చు. అలాగే ఉదయం లేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది.   

రోగనిరోధక శక్తి: ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ద్వారా మనం అనారోగ్యం నుండి రక్షించుకోవచ్చు. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఏర్పడటానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే క్రమంగా ఈ అలవాటు మీ జీవితంలో భాగమైపోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link