Ear Piercing: చెవులు కుట్టించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
చెవులు కుట్టించడంలో ఆధ్యాత్మిక పరమైన నమ్మకాలు వున్నప్పటికీ ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఫలితాలువున్నాయి.
చెవులు కుట్టించుకోవడం వల్ల మహిళలకు ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఋతు క్రమం నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
చెవిపోగులు వేసుకోవడం వల్ల శరీరంలో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
చెవి కేంద్ర బిందువుపైన ఒత్తిడి పెట్టడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని పరీశోధనలో తేలింది. ఈ విధంగా చెవులు కుట్టించడం జరుగుతుంది.
చెవులు కుట్టించడం వల్ల మనలోని భయం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు.
చెవి కుట్టిన పాయింట్ వల్ల మనలో జీర్ణవ్యస్థ సక్రమంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
వైద్యుల ప్రకారం చెవి కుట్టడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగా జరుగుతుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.