FASTag: నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి

Mon, 15 Feb 2021-11:18 am,

What Is FASTag: ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కలిగి ఉన్న ప్రభుత్వం అందించే ట్యాగ్. టోల్ కట్టాల్సిన అన్ని పెద్ద వాహనాలు FASTagను వాహనం మీద విండ్ షీల్డ్‌పై అతికిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే అక్కడ ఉండే RFID రీడర్ FASTagను స్కాన్ చేసి వివరాలు పరిశీలిస్తుంది. ఈ ట్యాగ్‌పై వాహనదారులు అందించిన ఖాతా నుంచి టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

Also Read: FASTag: ఒక్కరోజులోనే 80 కోట్లు దాటిన ఫాస్టాగ్ టోల్ ఆదాయం

భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ వాడకాన్ని అమలు చేసింది. అయితే ఫిబ్రవరి 16(ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి) వాహనాలకు తప్పనిసరి చేసింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండం వల్ల ఇంధనంతో ప్రయాణికుల సమయం వృథా అయ్యేది. వీటిని అధిగమించేందుకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. 

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, పెరుగుతున్న Silver Price

గుర్తింపు ఉన్న బ్యాంకులు అయిన ICICI బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాలు, పేటీఎం లాంటి డిజిటల్ మాధ్యమాల నుంచి సైతం FASTagను పొందవచ్చు. వీటికి 5 సంవత్సరాలు వాలిడిటీ కల్పిస్తారు.

Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం 

వాహనదారులు ఫాస్టాగ్ కొనాలంటే తప్పనిసరిగా KYC ప్రక్రియ పూర్తి చేయాలి. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, వ్యక్తిగత గుర్తింపు కార్డు అందించాలి. వాహనదారుడు సంబంధిత వివరాలు, కేవైసీ పత్రాలతో ఫాస్టాగ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరైతే KYC Document Verification వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో వారికి ఇంటికి ఫాస్టాగ్ స్టిక్కర్ డెలివరీ అవుతుంది. 

టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండం వల్ల ఇంధనంతో ప్రయాణికుల సమయం వృథా అయ్యేది. ఫాస్టాగ్‌ను మీ వాహనానికి అతికించుకుంటే మీకు ఈ సమయం, ఇంధనం  వృథా సమస్య తగ్గుతుంది. ఫాస్టాగ్‌లో భాగంగా వాహనాల వెరిఫికేషన్ సైతం పనిలో పనిగా పూర్తవుతుంది.

Also Read: Aadhar card with Indane gas:ఆధార్ కార్డును ఇండేన్ గ్యాస్‌తో ఇలా లింక్ చేసుకోవాలి..లేదంటే సబ్సిడీ రాదు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link