What Time Breakfast: ఏ టైమ్‌లో టిఫిన్‌ చేయాలి.. ఈ టైమ్‌కు టిఫిన్‌ చేస్తే అద్భుత ప్రయోజనాలు

Wed, 31 Jul 2024-3:03 pm,

What Is Right Time For Breakfast: కొందరు ఇష్టమొచ్చిన సమయంలో టిఫిన్‌ చేస్తుంటారు. కానీ అది సరికాదు. రోజు ఒక సమయంలో టిఫిన్‌ తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

What Is Right Time For Breakfast: అల్పాహారం చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఉత్తమ సమయం ఇదే What Is Right Time For Breakfast: ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయం. చాలా ఆలస్యమయితే మీరు తప్పనిసరిగా ఉదయం 10 గంటలకు అల్పాహారం తీసుకోవాలి. ఇంతకంటే ఆలస్యం చేయవద్దు.

ఆలస్యంగా నిద్ర

What Is Right Time For Breakfast: మీరు ఆలస్యంగా నిద్ర లేచినట్లయితే నిద్రలేచిన గంటలోపు అల్పాహారం తీసుకోవాలి. అయితే ఆలస్యంగా లేవడం మంచిది కాదు. ఇంకా ఆలస్యంగా అల్పాహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. 

రాత్రి ఉపవాసం తర్వాత

What Is Right Time For Breakfast: ఒక రాత్రి అంటే 8 గంటల తర్వాత మనం టిఫిన్‌ తీసుకుంటాం. అంటే ఉపవాసం చేసినట్టే. ఉపవాసం తర్వాత వెంటనే మన శరీరానికి శక్తి అవసరం. ఉదయం పూట గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాబట్టి అల్పాహారం వెంటనే తీసుకోవాలి. 

గ్లూకోజ్ సరఫరా

What Is Right Time For Breakfast: ఉదయం అల్పాహారం తప్పక తీసుకోవాలి. టిఫిన్‌ తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ సరఫరా ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాలకు శక్తి లభిస్తుంది. మెదడు సరిగ్గా పని చేస్తుంది, ఉత్తేజితమవుతుంది. 

జీర్ణక్రియ కోసం

What Is Right Time For Breakfast: అల్పాహారంగా ఇడ్లీ, దోశ, పూరీనే తినాల్సిన అవసరం లేదు. బరువు తగ్గాలనుకునేవారు పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తీసుకున్న పర్వాలేదు. వాటి ద్వారా శరీరంలోకి ఫైబర్ వెళుతుంది. ఇది జీర్ణక్రియకు మంచిది.

వోట్‌ మీల్

What Is Right Time For Breakfast: మీరు అల్పాహారంగా ఓట్ మీల్ కూడా తీసుకోవచ్చు. ఓట్‌ మీల్‌, పండ్లు, కూరగాయల స్మూతీని కూడా తినవచ్చు. గుడ్డు, టోస్ట్ మొదలైనవి కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు.

ఆకలి What Is Right Time For Breakfast: ఉదయం అల్పాహారం తీసుకోవడంతో ఆకలి సమస్య తీరుతుంది. అల్పాహారం అంటే మితంగా తినాలి. అధిక ఆహారాన్ని తినడం మానుకోవాలి. అల్పంగా అంటే తక్కువ తింటే బరువును నియంత్రణలో ఉంచుతుంది. అలా అని పూర్తిగా తినకుండా ఉండడం మంచిది కాదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link