Rail Force One: ఎయిర్‌ఫోర్స్ కాదు రైల్‌ఫోర్స్.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్ ఫీచర్లు ఇవే..
రైల్ ఫోర్స్ ఇది మనమందరం ప్రయాణం చేసే మాములు ట్రైన్ కాదు. ఇది అత్యంత లగ్జరీగా అప్డేడేటెడ్ సెక్యూరిటీ ఫీచర్స్‌తో తయారు చేసింది. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ వాడి తయారు చేసింది ఉక్రేయిన్ దేశం. మన దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారు. ఈయన రేపు ఉక్రేయిన్ ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా ఈ రైల్ ఫోర్స్ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
రైల్ ఫోర్స్ చూడటానికి ఓ ఫైవ్ స్టార్ హోటల్ మాదిరి ఉంటుంది. మంచి డైనింగ్ కార్, ప్రైవేటు కంపార్ట్‌మెంట్ అన్ని సౌకర్యాలు కలిగి ఉంటుంది. ఇది కేవలం లగ్జురీయస్‌గా కనిపించడమే కాకుండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్‌తో తయారు చేశారు. ఇది కేవలం వీఐపీల భద్రత నేపథ్యంలో తయారు చేశారు కాబట్టి ఇందులో భద్రమైన కమ్యూనికేషన్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు.
అంటే ఇంచుమించు ఎయిర్ ఫోర్స్ మాదిరి ఈ రైల్ ఫోర్స్ పనిచేస్తుందన్నమాట. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇందులో ప్రయాణం చేయవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం ఈ ట్రైన్ లేటెస్ట్ టెక్నాలజీతో సేఫ్ జర్నీ చేయవచ్చు. ఇందులో సీసీటీవీ రికార్డు సిస్టం కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఈ రైల్ ఫోర్స్‌లో ప్రయాణించే వీఐపీల భద్రతను గమనిస్తూ ఉంటారు. వారిని ట్రాక్ చేస్తూనే ఉంటారు.
ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో భద్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ రైలును తయారు చేశారు. ముఖ్యంగా ఇతర దేశాల అంతర్జాతీయ అధినేతలు ఉక్రెయిన్ సందర్శన కోసం దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యువల్ మాక్రాన్ ఇందులో కైవీ వరకు ట్రావెల్ చేశారు.
ఉక్రెయిన్ అధినేత జెలన్‌స్కీ కూడా ఈ ట్రైన్ ద్వారా ఇతర దేశాలకు ప్రయాణం చేస్తారు. ఈ రైల్ ఫోర్స్ ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో కూడా సురక్షితంగా ఇతర దేశ నాయకులు కూడా ఈ దేశాన్ని ప్రయాణించగలరని నిర్ధారించడానికి,అంతేకాదు దౌత్యపరంగా కూడా ఉక్రెయిన్ సామర్థ్యానికి ఇది అద్దంపడుతుంది.