Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?

Thu, 06 Aug 2020-3:17 pm,

యువరాజ్ సింగ్ చిన్నప్పటి నంచి స్కేటింగ్ అంటే ఇష్టం ఉండేది. అయితే తండ్రి మాత్రం అతన్ని క్రికెటర్ గా చూడాలి ( What If Yuvraj Singh Was Not a Cricketer ) అనుకునేవాడట. అందుకే యువరాజ్ క్రికెటర్ అయ్యాడట. 

భారతీయ మహిళ క్రికెట్ టీమ్ లో అత్యుత్తమ బ్యాట్స్ వుమెన్ స్మృతి మంథాన క్రికెటర్ కాకపోయి ఉంటే ( What If Smrithi Mandhana Was Not a Cricketer )షెఫ్ అయ్యేవారట. స్మృతి మంథాన కుకింగ్ అంటే చాలా ఇష్టమట

ది వాల్ గా పేరు సంపాదించుకున్న క్లాసిక్ బ్యాట్స్ మెన్  రాహుల్ ద్రావిడ్ ( What If  Rahul Dravid Was Not a Cricketer )  పేరు కూడా ఈ లిస్టులో ఉంది. రాహుల్ ద్రావిడ్ క్రికెటర్ అవ్వకపోయి ఉంటే హాకీ ప్లేయర్ అయ్యేవారట. ద్రావిడ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. ధనాధన్ ధోనీ రైల్వేలో టికెట్ కెలక్టర్ (TC ) గా పని చేశారు. క్రికెటర్ అవ్వకపోయి  ( What If MS Dhoni Was Not a Cricketer ) ఉంటే మహేంద్ర సింగ్ ధోనీ నేటికీ టికెట్ కలెక్టర్ గా కొనసాగేవాడట.

భారతీయ మహిళ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెటర్ అవ్వకపోయి ఉంటే ( What If Mithali Raj Was Not a Cricketer ) మాత్రం పక్కాగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయ్యేవారట.

భారతీయ బౌలింగ్ లో దిగ్గజం అయిన అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి ( What If Anil Kumble Was Not a Cricketer ) చేశాడు. క్రికెట్ లో రాణించకపోతే కనీసం ఇంజినీర్ అయినా అవ్వొచ్చు అని అలా చేశాడట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link