WhatsApp ban: అయ్యయ్యో.. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది..ఈ దేశాల్లో వాట్సాప్ సేవలు బంద్..కారణం ఏంటంటే..?

Mon, 16 Sep 2024-6:43 pm,
WhatsApp ban in these countries:

మన నిత్య జీవితంలో మొబైల్ ఫోన్ ఒక  భాగమైందని చెప్పుకొవచ్చు.ఒక్కనిముషం ఫోన్ కన్పించకుంటే.. చాలా మందితమ  జీవితంలో ఏదో కోల్పొయినట్లు భావిస్తారు. ఇక వాట్సాప్, ఫెస్ బుక్ లు మొదలైన ప్లాట్ ఫామ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. వాట్సాప్ ను చాలా  ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని దేశాలు మాత్రం వాట్సాప్ మీద నిషేధం విధించాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp ban in these countries:

ప్రపంచంలోని 6 ప్రధాన దేశాలలో WhatsApp నిషేధించినట్లు తెలుస్తోంది. వీటిలో చైనా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సిరియా ఉత్తర కొరియా ఉన్నాయి. ఈ దేశాల్లో వాట్సాప్‌ను నిషేధించడం వెనుక వివిధ కారణాలున్నాయి. కొన్నిరకాల భద్రత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

WhatsApp ban in these countries:

ఉత్తర కొరియా: ఉత్తర కొరియా గురించి ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు. అక్కడి అధ్యక్షుడు కిమ్ తీసుకునే దారుణామైన నిర్ణయాలు ప్రతిరోజు వార్తలలో ఉంటాయి. అక్కడ ఎక్కువగా జనాలు.. నెట్ ఉపయోగించుకొవద్దని అక్కడ వాట్సాప్ మీద బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది.

చైనా: భారత్ పొరుగు దేశం చైనా పరిస్థితి కూడా ఉత్తర కొరియా తరహాలోనే ఉంది. ఇక్కడ కూడా ఇంటర్నెట్‌పై.. అక్కడి ప్రభుత్వం నియంత్రణను కలిగి ఉంది. చైనీస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గ్రేట్ ఫైర్‌వాల్ ఉంటుంది.  అక్కడి పౌరులు..విదేశీ యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. విదేశీ యాప్‌లకు బదులుగా WeChat వంటి స్వదేశీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం సమగ్ర వ్యూహంపై పనిచేస్తుంది.

సిరియా: వాట్సాప్‌ను సిరియాలోనూ నిషేధించారు. సిరియా చాలా కాలంగా అంతర్యుద్ధంతో పోరాడుతోంది. పైగా సిరియాపై అనేక ఆంక్షలు విధించారు. దీని కారణంగా సిరియాలో వాట్సాప్ నిషేధించబడింది. దేశంలో జరిగే విషయాలు బయటికి చేరడం ఇక్కడి ప్రభుత్వం, వాట్సాప్ ను కట్టడిచేసినట్లు తెలుస్తోంది.

ఇరాన్: ఇరాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. అణుబాంబు విషయంలో ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తోంది. దీని కారణంగా వాట్సాప్ ఇరాన్‌లో ఎప్పటికప్పుడు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. శాంతి భద్రతల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఖతార్: తమ పౌరుల కోసం వాట్సాప్ వాయిస్,  వీడియో కాలింగ్ ఫీచర్లను ఖతార్ ప్రభుత్వం బ్లాక్ చేసింది. కానీ మెస్సెజ్ సందేశం ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఖతార్ ప్రభుత్వం తన టెలికాం కంపెనీలకు, కస్టమర్ కేర్ సిస్టమ్ లేకుండా బ్యాన్ చేసింది

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ): ఇటీవలి కాలంలో యూఏఈలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదిలావుండగా, అక్కడి ప్రభుత్వం ఖతార్ ప్రభుత్వం వలె వాట్సాప్ వాయిస్,  వీడియో కాలింగ్ సౌకర్యాలను బ్లాక్ చేసింది. UAEలో టెక్స్ట్ మెసేజింగ్ సౌకర్యంపై ఎలాంటి నిషేధం లేదు. దీంతో ఈ దేశాల్లలో వాట్సాప్ సేవలు మాత్రం అందుబాటులో లేవని చెప్పుకొవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link