Whatsapp: త్వరలో రానున్న వాట్సప్ కొత్త ఫీచర్లు ఇవే
త్వరలోనే వాట్సప్ రీడ్ లేటర్ సౌకర్యాన్ని కల్పంచనుంది. యూజర్ ఏదైనా చాట్ మెస్సేజ్‌ను రీడ్ లేటర్ చేయగానే..ఆ చాటింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ రావడం ఆగిపోతుంది.
వాట్సప్ యాప్‌కు మల్టీ డివైస్ సపోర్ట్ ఇచ్చేందుకు కూడా కంపెనీ ఆలోచిస్తోంది. త్వరలోనే ఒకే వాట్సప్ ఎక్కౌంట్‌ను 4 డివైస్‌లలో వినియోగించుకోవచ్చు.
ఇటీవల వాట్సప్ పేమెంట్ ప్రారంభించిన వాట్సప్..ఇప్పుడు ఇన్సూరెన్స్ సేవల్ని కూడా ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఇన్సూరెన్స్ సేవల కోసం SBI , HDFC బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి.
వాట్సప్ త్వరలో డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ నుంచి కాలింగ్, వీడియా చాటింగ్ ఫీచర్లను కల్పించనుంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రారంభమైంది. త్వరలోనే ఈ ఫీచర్ ప్రవేశపెట్టనుంది.