Whatsapp Secret Feature: వాట్సాప్‌లో ఎవ్వరికి తెలియని దిమ్మతిరిగే ఫీచర్స్.. మీరు కూడా తెలుసుకోండి!
ప్రస్తుతం వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఈ ఫీచర్స్ వాట్సాప్‌ని మరింత సౌకర్యవంతంగా, ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఇప్పటికే పోల్స్, అనౌన్స్మెంట్లు, గ్రూప్ డిస్కషన్లు మొదలైన ఫీచర్స్ గ్రూప్‌లను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తున్నాయి.
వాట్సాప్ యూజర్ల ప్రైవసీని మరింత పెంచడానికి ఇప్పటికే చాట్ లాక్ ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మనకు కావాల్సిన వారి చాట్స్‌ను లాక్ చేసుకోవచ్చు.
దీని కోసం మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేసిన కావాల్సిన చాట్‌పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తరువాత కుడివైపు ఉన్న (:) క్లిక్ చేసి చాట్ లాక్‌ను చేయాలి. ఆ తరువాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే చాట్ లాక్ అవుతుంది.
అయితే కొన్నిసార్లు వాట్సాప్ చాట్స్‌ను కిందకు స్వైప్ చేసినప్పుడు చాట్ లాక్ కనిపిస్తుంది. దీని వల్ల మన పాస్వర్డ్ తెలిసినవారు చాట్స్‌ను తెరిచే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసువచ్చింది.
ఈ కొత్త ఫీచర్ ఉపయోగిస్తే మీరు లాక్ చేసిన చాట్ ఎవరికి కనిపించదు. ముఖ్యంగా ఈ ఫీచర్ యువతకు ఎంతో ఉపయెగపడుతుందని చెప్పవచ్చు. దీని కోసం మీరు కొన్నిసెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది.
సింపుల్‌గా మీరు లాక్ చేసిన చాట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న (:) క్లిక్ చేయండి. ఆ తరువాత చాట్ లాక్ సెట్టింగ్స్ ఆప్షన్ ను ఓపెన్ చేయండి. మీకు హైడ్ లాక్ చాట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని క్లిక్ చేయండి.
ఆ తరువాత ఒక కోడ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే మీ చాట్ ఇకపైన కిందకు స్వైప్ చేసిన కూడా కనిపించదు. మీరు ఓపెన్ చేయాలంటే సెర్చ్ మీద మీ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ మీకు నచ్చితే మీరు కూడా ఈ ఫీచర్‌ను ట్రై చేయండి. ఒక వేళ ఈ ఫీచర్ కనిపించకపోతే వాట్సాప్‌ను అప్డేట్ చేయండి.