Siddhi Vinayaka temple: ప్రతిష్టాత్మక సిద్దివినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఏ సమయంలో ఎలా సందర్శించాలి?

Sat, 07 Sep 2024-8:02 am,

నిన్న బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణే దంపతులు కూడా ఈ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ నెలలోనే దీపికా రణ్‌వీర్‌లు తమ ఫస్ట్‌ బేబీకి స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా వీరు వినాయక చవితి ముందు రోజు సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి ఆదిదేవుని ఆశీర్వాదాలు తీసుకున్నారు.  

ఈరోజు శనివారం సెప్టెంబర్‌ 7 నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. పురాణాల ప్రకారం ఈ రోజు శివపార్వతులకు గణేషుడు జన్మించాడు. అయితే, మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సెలబ్రిటీలు సైతం వెళ్లే కొన్ని ఆలయాలు ఉన్నాయి.  

సిద్ధివినాయక ఆలయం ఎలా వెళ్లాలి? ప్రతిష్టాత్మక సిద్ధివినాయక ఆలయం దేశంలోనే అతిపురాతన ఆలయం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇక్కడికి నేరుగా అన్ని మార్గాలు ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి రైలు, విమానం మార్గాలు ఉన్నాయి. ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

ఒక వేళ మీరు హైదరాబాద్‌ నుంచి సిద్ధివినాయక ఆలయం వెళ్లాలనుకుంటే ఇక్కడి నుంచి నేరుగ ముంబైకి విమానం బుక్ చేసుకుంటే అక్కడి నుంచి కేవలం 18 కీమీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మీరు ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌ లేదా ఏదైనా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును కూడా ఆశ్రయించవచ్చు.  

రైలు మార్గంలో వెళ్లాలంటే ఇది మరింత సులభం ఛత్రపతి శివాజి టెర్మినల్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి మీరు క్యాబ్‌ లో వెళ్లవచ్చు. అక్కడ దగ్గరలో దాదర్‌ రేవాలే స్టేషన్‌ కూడా ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేవారు కూడా ఉన్నారు. ఈ ఆలయం దర్శించుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయం ఉంటుంది.   

ఎక్కువశాతం మంది మంగళవారం జరిగే హారతిలో పాల్గొంటారు. ఈరోజు ఉదయం 3:15 నుంచి రాత్రి 10 గంటల వరకు మొత్తం ఆరు రకాల హారతులు నిర్వహిస్తారు. శ్రీ దర్శన, కాకడ, నేవేద్య, రాత్రి ప్రార్థన, ఆరతి తర్వాత ఆలయం మూసివేస్తారు. ఈ ఆలయంలో రెండు గేట్లు ఉంటాయి. సిద్ధి, రిద్ధిగేట్‌లు ఉంటాయి. రిద్ధి గేట్‌ నుంచి వెళ్లడానికి రుసుము చెల్లించాలి. సిద్ధి గేట్‌ ద్వారా ఉచిత దర్శనం చేసుకోవచ్చు. మహిళా, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link