Where to invest money: ఆడపిల్లల సురక్ష.. ఇలా చేస్తే రూ.70 లక్షలు మీ సొంతం..!

Sun, 18 Aug 2024-9:00 am,

కాలం ఏదైనా సరే ఆడపిల్ల పుట్టిందంటే చాలు తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు.ముఖ్యంగా వారి భవిష్యత్తు కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమ్మాయిల కోసం తీసుకురావడం గొప్ప ప్రశంసనీయం అని చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పెట్టుబడి మార్గాల లో అమ్మాయిల కోసం ప్రతి నెల కొంత డబ్బును ఆధా చేస్తే కచ్చితంగా అమ్మాయి భవిష్యత్తుకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు.   

ఇక అమ్మాయిల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలలో సుకన్య యోజన సమృద్ధి పథకం ఒకటి. ఈ పథకంలో ప్రతినెల కొంత మొత్తంలో జమ చేయడం వల్ల మీ కూతురు భవిష్యత్తు కి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఏకంగా రూ.70 లక్షల మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది మీ పాప యొక్క విదేశీ విద్యకు వివాహానికి బాగా పనికి వస్తుంది. ముఖ్యంగా పాప వయసు 10 సంవత్సరాల లోపు ఉండాలి.  

ఇకపోతే ప్రతినెలా ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే.. మన చేతికి ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే.. కనీసం 250 రూపాయల పెట్టుబడితో గరిష్టంగా రూ .1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా ఈ పథకం లో 8.2% వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లు సవరిస్తారు కాబట్టి అలాగైనా ఉంచవచ్చు లేదా పెంచవచ్చు. ముఖ్యంగా మీరు ఇందులో 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే మీ కుమార్తెకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ చేతికి డబ్బులు లభిస్తాయి. 

ఉదాహరణకు మీ కుమార్తె పేరు మీద సంవత్సరానికి మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతినెల రూ.8,334 పెట్టుబడి పెట్టాలి. ఇలా దాదాపు 15 సంవత్సరాల పాటు మీరు పెట్టుబడి పెట్టడం వల్ల అది రూ.15 లక్షలు అవుతుంది. 21 సంవత్సరాల తర్వాత మీకు రూ.31,18,385 వడ్డీతో కలుపుకొని సుమారుగా రూ.46,18, 385 లభిస్తుంది. 

ఒకవేళ మీరు ప్రతి నెల రూ .1,50,000 పెట్టుబడిగా పెట్టినట్లయితే 15 సంవత్సరాలలో రూ .22, 50,000 పెట్టుబడి పెట్టాలి.  ఇక రూ .46,77,578 వడ్డీతో కలుపుకొని రూ.69, 27, 578 మీరు సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపుగా రూ.70 లక్షల వరకు మీరు ఈ పథకం ద్వారా పొందవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link