White Hair To Black Hair: ఏం చేసిన తెల్ల జుట్టు తగ్గడం లేదా? అయితే వీటితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు!
విటమిన్ ఎ, సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జుట్టును దృఢంగా చేయడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ఆహారంలో ప్రతి రోజు ఆకు కూరలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
డ్రైఫ్రూట్స్ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బాదం, పిస్తా పలుకులను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు మెలనిన్ స్థాయిలను పెంచుతుంది.
కందగడ్డలో ఉండే పోషకాలు తెల్ల జుట్టు సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కెరోటిన్ అధిక పరిమాణంలో ఉంటాయి. కావున ప్రతి రోజు వీటిని నీటిలో ఉడికించి తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చు.
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి సలాడ్స్‌లో గాని, పండ్ల రసాల్లో వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు పొడవుగా పెరుగుతుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బెర్రీలను తీసుకోవాల్సి ఉంటుంది.
తెల్ల జుట్టు సమస్యలను తగ్గించుకునేందుకు ప్రొటీన్ అధిక పరిమాణంలో లభించే గుడ్లను తినాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్లు B5, B12 కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జుట్టును దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా తలలో రక్త ప్రసరణను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.