Baba Siddique: బాబా సిద్ధీఖీ ఎవరు?... ఎన్సీపీ నేత హత్యకు నెల రోజుల ముందు నుంచి అంత జరిగిందా..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

Sun, 13 Oct 2024-1:30 pm,

బాబా సిద్దీఖీ నిన్న రాత్రి ముంబైలో హత్యకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా దేశంలో ఇది పెనుదుమారంగా మారింది. అసలు బాబా సిద్ధిఖీ ఎవరు.?.. ఆయనను హత్యసింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బాబా సిద్దీఖీ బాంద్రాలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేవారు. ప్రస్తుతం ఎన్సీపీ పార్టీలో ఉన్నారు. ఆయన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు  మంచి ఫ్రెండ్.

 అయితే.. ఆయన నిన్న తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొంత మంది దుండగులు ఆయనపై కాల్పులు జరిపి మరీ హతమార్చారు. బాబా సిద్దీఖీ హత్య జరిగిన ఘటన వెలుగులోకి రావడంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.   

ఇదిలా ఉండగా..  ఈ ఘటనలో.. ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు.  హర్యానాకు చెందిన  కర్నైల్ సింగ్, యూపీ కి చెందిన ధర్మరాజ్ కశ్యప్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వీరంతా బిష్ణోయ్ వర్గానికి చెందిన వారని తెలుస్తోంది.

మరోవైపు బాబా సిద్దిఖీను హత్య చేసేందుకు దుండగులు నెల రోజుల నుంచి బాబా సిద్దీఖీ పార్టీ ఆఫీసు, ఇంటి చుట్టు పక్కల రెక్కీ నిర్వహించారంట. అయితే.. ఈ గ్యాంగ్ కు చెందిన వారే గతంలో పలు మార్లు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కుట్ర చేశారని తెలుస్తోంది.   

ఈ నేపథ్యంలో బాబా సిద్దీఖీ కొన్ని నెలల క్రితమే.. కాంగ్రెస్ నుంచి ఎన్సీపీ (శరద్ పవార్ ) పార్టీలో చేరారు. అయితే..ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.  ముంబైలోని మురికి వాడ పునారావాస ప్రాజెక్ట్ కూడా దీని వెనకాల కారణమని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే బాబా సిద్దీఖీ ప్రాణహని ఉందని చెప్పడంతో.. పోలీసులు గత 15 రోజుల క్రితమే వై కేటగిరి సెక్యురిటీని కల్పించారు. అయితే.. వై కేటగిరి భద్రత కల్పించిన కొన్ని రోజులకే హత్య జరగటం మాత్రం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో అది కూడా వై కేటగిరి భద్రత ఉన్న నేతలకు ప్రాణాలకు సెఫ్టీలేకుంటే.. నార్మల్ ప్రజలు, అపోసిషన్ పార్టీ నేతల పరిస్థితి ఏంటని  కూడా నాయకులు తీవ్ర  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఈ ఘటనపై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  స్పందించారు. అయితే..  మహారాష్ట్రలో తొందరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో.. అక్కడ  ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా పతన మయ్యాయని స్పష్టం చేశారు. 

ఈ ఘటన పట్ల ప్రస్తుతం  రాజకీయాల్లో, బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనన తెలియగానే సల్మాన్ ఖాన్ తన షూటింగ్ ను సైతం క్యాన్షిల్ చేసుకుని మరీ బాబా సిద్దీఖీ భౌతిక కాయంను చూసేందుకు వెళ్లారంట.

అదే విధంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సైతం.. బాబా సిద్దీఖీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున సిద్దీఖీకి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link