Beer Stuff: బీర్- పల్లీల అవినాభావ సంబంధం.. తాగుబోతులకు విస్తుగొలిపే విషయాలు
ప్రపంచ వ్యాప్తంగా మద్యం అలవాటు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో కూడా మద్యంప్రియుల సంఖ్య పెరిగిపోతోంది.
మద్యం సేవించే సమయంలో అత్యధికంగా వేరుశెనగలు తింటారు. ముఖ్యంగా బీరు అలవాటు ఉన్నవారికి పల్లీలు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? దీని వెనుక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
ప్రజలు తాగేటప్పుడు స్టఫ్‌గా రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు. వాటిలో అత్యధికంగా పల్లీలు తీసుకుంటున్నారు.
బీర్‌తోపాటు వేరుశెనగలు తినడం వెనుక కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో అందరికీ ఇష్టమైనది పల్లీలే.
బీర్ లేదా ఇతర మద్యం రుచి కొంత చేదుగా ఉంటుంది. ఉప్పు వేసిన వేరుశెనగ ఆ చేదును తగ్గిస్తుంది. ఈ సందర్భంగా కాల్చిన వేరుశెనగలను మద్యంతో తీసుకుంటారు.
పల్లీలు తినడానికి మరొక కారణం కూడా ఉంది. వేరుశెనగ తింటే గొంతు పొడిబారుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతాం. అంటే బీరు అధికంగా సేవించేందుకు పల్లీలు తింటారు.