Constipation: శీతాకాలంలో మలబద్ధకం సమస్య సహజమే, మరి ఉపశమనం ఎలా
కిస్మిస్ అనేది మలబద్ధకం సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే..రోజూ ఉదయం పరగడుపున కిస్మిస్ తినడం అలవాటు చేసుకోవాలి.
ఆవు నెయ్యి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కల్గిస్తుంది. కడుపులో గ్యాస్ సమస్య ఉన్నా నెయ్యి మంచి ప్రత్యామ్నాయం కాగలదు. రోజూ ఒక గ్లాసు వేడి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగాలి.
మెంతులు ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
శీతాకాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. తక్షణం వీటిని డైట్‌లో చేర్చడం ద్వారా ఇమ్యూనిటీ పెంచవచ్చు. దాంతోపాటు మలబద్ధకం సమస్య దూరమౌతుంది. దీనికోసం పాలలో ఖర్జూరం పండ్లను ఉడకబెట్టి తినాల్సి ఉంటుంది.
చలికాలంలో ఉసిరికాయలు మార్కెట్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఈ పరిస్థితుల్లో మలబద్ధకం సమస్య వేధిస్తుంటే..రోజూ పరగడుపున ఉసిరికాయలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.