Winter Skin Care Tips: చలికాలంలో చర్మం పొడిబారిపోతుందా..?.. ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టొచ్చు..
చలికాలంలో ముఖ్యంగా చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మిగత కాలంలో లాగా చలికాలంలో ఉంటే సమస్యలు వస్తాయి.
ఈ కాలంలో చాలా మంది నీళ్లను తాగడం అవాయిడ్ చేస్తారు. కానీ నీళ్లను చలికాలంలో ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతుంటారు. మెయిన్ గా.. చల్లని నీళ్లను కాకుండా గోరు వెచ్చని నీళ్లను తాగితే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ కాలంలో రాత్రిపూట పడుకునే టప్పుడు తప్పకుండా ఆయిల్ తో మర్దన చేసుకొవాలి. లేకుంటే మార్కెట్ లో లభించే ఏదైన మాయిశ్చరైజేషన్ లను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
మెయిన్ గా బైటకు వెళ్లేటప్పుడు తప్పకుండా స్కార్ఫ్ లను ధరించి వెళ్లాలి. స్కార్ప్ లేడా కడ్చీప్ లు, బైక్ ల మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ లను ధరించుకొవాలి. చలికాలంలో చాలా మంది రోడ్డుపక్కనుండే వేడి పదార్థాలు, బజ్జీలు, స్నాక్స్ లు కొంటుంటారు.
కానీ ఈ కాలంలో బైట ఫుడ్ ను వీలైనంతగా అవాయిడ్ చేయాలి. ఈ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ లను తింటే మాత్రం ముఖంపై మొటిమలు రావడం జరుగుతుంది. అందుకే చాలా మంది చలికాలంలో ముఖంపై మచ్చలు రావడం జరుగుతుంది.
ఉదయం పూట కూడా బైటకు వెళ్లేటప్పుడు సైతం.. బాడీకి మాయిశ్చరైజేషన్ లు పూసుకొవాలి. వీలైనంతగా దుమ్ము, ధూళి, వాహానాల నుంచి వచ్చే పొగలకు దూరంగా ఉండాలి. మంచి హెల్తీఫుడ్, ఫ్రూట్స్ లను ఆహారంగా తీసుకొవాలి.