Tirumala: జడలో పూలు ధరించడం నిషేధం.. తిరుమలలో మహిళలు ఈ తప్పు అస్సలు చేయకండి!
నియమాలు: కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన క్షేత్రం తిరుమల. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్న ఈ కొండపై కొన్ని నియమాలు ఉన్నాయి.
నిబంధన: చాలా మంది భక్తులకు తిరుమలలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి తెలియక భక్తులు అలాగే ఉంటుంటారు. ముఖ్యంగా మహిళలకు ఒక నిబంధన ఉంది.
జడలో ధరించడం: తిరుమల కొండపై మహిళలు తలలో పూలు ధరించరాదు. ఈ విషయం చాలా మంది మహిళలకు తెలియకపోవచ్చు.
అలంకరణ నిషేధం: స్త్రీలు తమ తలలను పూలతో అలంకరించుకోరాదు. ఎందుకంటే శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందుతుంది.
పురాణ గాథ: తిరుమలలో పూలు ధరించరాదు అని చెప్పేందుకు ఒక కథ కూడా ఉంది. శ్రీశైలపూర్ణుడు అనే అర్చకుడికి పరిమళ అనే శిష్యురాలు ఉంది. స్వామి అలంకరణకు ఉపయోగించే పూలతో పరిమళ ఒకరోజు అలకరించుకుంది. ఆ రాత్రి స్వామివారు కలలోకి వచ్చి 'పరిమళ నీకు ద్రోహం చేసింది. నాకు చెందాల్సిన పూలను ఆమె అలంకరించుకుంది' అని చెప్పడంతో శ్రీశైలపూర్ణ ఆగ్రహంతో పరిమళపై మండిపడ్డారు.
ప్రతి పువ్వు స్వామికే: తిరుమల కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికేనని నాటి నుంచి ఒక నమ్మకం ఉంది. పర్వత శిఖరంపై ఉన్న పూల సంపద అంతా స్వామికే చెందాలని నియమం మొదలైంది.
అపవిత్రం: ఇక స్వామికి అలంకరించిన పూలను భక్తులకు ఎందుకు ఇవ్వరో తెలుసా? స్వామి అలంకరించిన పూలు భక్తులకు ఇస్తే అపవిత్రం చేస్తారనే భావనతో ఆ పూలన్నిటిని బావిలో వేస్తారు.
పూలు నిషేధం: ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాక మహిళలు ఇకపై తిరుమల వెళ్లిన సమయంలో తలలో పూలు ధరించకూడదు. అంతేకాకుండా అధిక అలంకరణతో వెళ్లకుండా సంప్రదాయ దుస్తుల్లో సాదాసీదాగా దర్శించుకుంటే స్వామి కటాక్షం లభిస్తుంది.