Chinab Rail Bridge: 8వ వింతగా ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైలు వంతెన, త్వరలో రైల్వే సేవలు
ఈ వంతెన నది అడుగు భాగం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఉధమ్‌పూర్-శ్రీనగర్ -బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగం ఇది. ఈ వంతెన కట్రా నుంచి బనిహాల్‌ను కలుపుతుంది.
ఇది భారతీయ ఇంజనీర్ల ప్రతిభ, సామర్ధ్యానికి నిదర్శనమంటున్నారు రైల్వే అధికారులు. ఈ వంతెనను ప్రపంచంలోని 8వ వింతగా అభివర్ణిస్తున్నారు. త్వరలోనే ఈ వంతెనపై రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అందించిన ఇంజనీరింగ్ అద్భుతంగా ఈ వంతెనను అభివర్ణిస్తున్నారు.
జమ్ము కశ్మీర్‌లోని రియసీ జిల్లాలో బక్కల్-కౌడీ మధ్యలో చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ వంతెన. రైల్వే అదికారులు ఇటీవలే ఈ వంతెనను పరీక్షించారు.
జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో లోయల్లోంచి ప్రవహించే అందమైన చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనతో రాంబన్-రియాసీ మధ్య రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఉత్తర రైల్వే ప్రకారం ఈ వంతెన పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో నిర్మించారు.