Dangerous Bridges: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర వంతెనలు ఇవే, మేఘాల్లోంచి ప్రయాణం
The Storseisundet Bridge, Norway
ఈ బ్రిడ్జ్ నార్వే తీరంలో నిర్మితమైంది. దీనిని అట్లాంటిక్ రోడ్ అని కూడా అంటారు. చూసేవారికి మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ వంతెనకు మరోపేరు రోడ్ టు నో వేర్. ఈ వంతెనపై డ్రైవింగ్ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. ఒకానొక కోణంలో గాలిలో తప్పిపోయినట్టు అన్పిస్తుంది
Royal Gorge Bridge, America
ఇది అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలోని క్యానన్ నగరంలో ఉంది. ఈ వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా పిలుస్తారు. 1929లో నిర్మించారు. అర్కంకాస్ నది నుంచి 955 అడుగుల ఎత్తులో నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జి. ప్రస్తుతం అమెరికాలో ఎత్తైన వంతెన ఇది. ప్రతి ఏటా 5 లక్షలమంది పర్యాటకులు సందర్శిస్తుంటారు
Duge Bridge, China
ఇంజనీరింగ్ అద్భుత వంతెనల్లో చైనాకు చెందిన ఈ వంతెన ముఖ్యమైంది. ఈ వంతెన చూస్తే కళ్లు తిరుగుతాయి. కేబుల్ ఆధారిత సస్పెన్షన్ వంతెన. బేయిపాన్ నదిపై 565 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ప్రపంచంలో ఎత్తైన వంతెన ఇది.
The Millau Viaduct Bridge, France
ఈ వంతెన చూసేందుకు ఎంత అద్భుతంగా, ఆకట్టుకునేలా ఉందో అంతే ప్రమాదకరమైంది. ఇది కేవలం కేబుల్స్ పై ఆధారపడిన సస్పెన్షన్ బ్రిడ్జి. టార్న్ ఘాటీ మీదుగా వెళ్తుంది. ఈ వంతెన ఎత్తు 336.4 మీటర్లు. మూడేళ్లలో సిద్ధమైంది.
Kandinsky Bridge, Russia
ఇది అత్యంత ప్రమాదకరమైన వంతెన. రష్యాలోని ట్రాన్స్ బైకాల్ ప్రాంతంలో ఉంది. ఈ వంతెనపై డ్రైవింగ్ అత్యంత రోమాంచితంగా ఉంటుంది. ఈ వంతెనపై డ్రైవింగ్ చేస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ వంతెన 570 మీటర్ల పొడుగు ఉంటుంది. వితిమ్ నది నుంచి 50 అడుగుల ఎత్తులో ఉంది.