Most Dangerous Places: ప్రపంచంలోనే అతి భయంకరమైన 5 ప్రదేశాలు, ఒకసారి వెళితే సజీవంగా రాలేరు
బెర్ముడా ట్రయాంగిల్
ఇది ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన, వింతైన మిస్టరీ ప్రాంతం. బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని ఓ ప్రాంతమిది. ఈ ప్రాంతం సరిహద్దు కచ్చితంగా తెలియదు. కానీ ఫ్లోరిడా, ప్యుటోరికా, బెర్ముడా మధ్యలో ఉన్న ట్రయాంగిల్ ప్రాంతం. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు అదృశ్యమౌతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎలా అదృశ్యమౌతున్నాయి, ఏమౌతున్నాయనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలింది
ఓయిమాయికోన్, రష్యా
రష్యా రాజధాని మాస్కోకు తూర్పు దిశలో సైబీరియాకు మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతం. ప్రపంచంలో అత్యంత చల్లని ప్రాంతం. ఇక్కడ నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత మైనస్ 71.2 డిగ్రీల సెల్సియస్, అతికష్టంగా ఇక్కడ ఓ 500 మంది నివసిస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే మరుసటి రోజు వరకూ ప్రాణాలతో ఉంటే ఆశ్చర్యపడాలి.
డనాకిల్ ఎడారి, తూర్పు ఆఫ్రికా
తూర్పు ఆఫ్రికాలోని డనాకిల్ ఎడారి ఇథియోపియాలోని నార్త్ ఈస్ట్ , ఇరిట్రియాకు దక్షిణంలో జిబూతీకు నార్త్ వెస్ట్ దిశలో విస్తరించి ఉంది. అగ్ని పర్వతాలతో నిండి ఉంటుంది.దీన్నించి విషపూరితమైన గ్యాస్ వెలువడుతుంటుంది. అత్యధిక వేడి ఉంటుంది. మనిషి తట్టుకోలేని వేడి పుడుతుంది. అందుకే ఈ ఎడారిని కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటుతుంటుంది.
స్నేక్ వరల్డ్ , బ్రెజిల్
బ్రెజిల్ దేశంలోని స్నేక్ వరల్డ్ ప్రాంతమిది. దేశంలోని సావో పావులో తీరానికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతాన్ని అత్యంత విషపూరిత పాములకు పుట్టిల్లుగా భావిస్తారు. భూమ్మీద మరెక్కడా కన్పించని అత్యంత ప్రమాదకరకమైన గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ ఇక్కడే ఉంటు్ంది. దీని విషం ఎంత ప్రమాదకరమైందంటే మనిషి మాంసాన్ని కూడా కరిగించేస్తుంది. ఈ పాము గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అందుకే ఈ ప్రాంతం నిషిద్ధంగా ప్రకటించింది
డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా
ఈ డెత్ వ్యాలీలోనే భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 1913 జూలై 10వ తేదీన 56.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతం ఉత్తర అమెరికాలోని నిర్జన ప్రదేశం.అందుకే ఈ ప్రాంతాన్ని డెత్ వ్యాలీ అంటారు. చలికాలంలో అత్యధికంగా చలి ఉంటుంది.