World Shortest Train: ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే ప్రయాణం కేవలం 1 నిమిషంలో, ఎక్కడో తెలుసా

Wed, 28 Aug 2024-8:38 pm,

ఈ రైలులో కేవలం రెండు కోచ్‌లు ఉంటాయి. వారి పేర్లు ఓలివేట్, సినాయి. ఈ రైలు ప్రయాణికుల్ని పట్టణంలోని ఒక వైపు నుంచి మరోవైపుకు కేవలం 1 నిమిషంలో చేరవేస్తుంది. ఈ ట్రైన్ గడిచిన కొద్దికాలంగా చాలాసార్లు క్లోజ్ అయింది. 2001లో ఓ ప్రమాదంతో క్లోజ్ చేశారు. ఆ తరువాత 2010 వరకు ఓపెన్ చేయలేదు. 2013లో ఓసారి క్లోజ్ అయింది. 2017లో తిరిగి లాంచ్ చేశారు.

లాస్ ఏంజెల్స్ థర్ట్ స్ట్రీట్ టన్నెల్ నుంచి హిల్ స్ట్రీట్ , ఓలివ్ స్ట్రీట్‌కు కలిపే ఈ రైలు 1901 నుంచి 1969 వరకూ నడిచింది. 

ఏంజెల్స్ ఫ్లైట్ ఇప్పటి వరకూ కోటికి పైగా ప్రయాణికుల్ని చేరవేసింది. ఈ ట్రైన్ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ స్నేహితుడు కర్నల్ జేడబ్ల్యూ ఏడీ నిర్మించాడు

ఏంజెల్స్ ఫ్లైట్ రైలు ప్రయాణ సమయం కేవలం 1 నిమిషంలో పూర్తయిపోతుంది. ఈ ట్రైన్ కేబుల్ ఆధారంగా నడుస్తుంది. 33 డిగ్రీల కోణంలో 315 అడుగుల దూరం ప్రయాణిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా నడుస్తుంది

ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్ పేరు ఏంజెల్స్ ఫ్లైట్ రైల్వే. ఈ రైలు కాలిఫోర్నియా డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లోని థర్డ్ స్ట్రీట్‌ను ఓలివ్ స్ట్రీట్‌తో కలుపుతుంది. ఇదొక నారో గేజ్ ప్యూనిక్యులర్ రైల్వే. 

ప్రపంచంలోనే అతి చిన్న రైలు అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉంది. ఈ రైలులో ప్రయాణం కేవలం 90 మీటర్లు.  కిలోమీటర్‌లో పదో భాగం కూడా ఉండదు. కేవలం 1 నిమిషంలో జర్నీ ముగుస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా రైలు ప్రయాణం అందరికీ ఇష్టం. కొన్ని రైల్వే ప్రయాణాలు రోజుల తరబడి ఉంటాయి. కొన్ని గంటల తరబడి ఉంటాయి కానీ ప్రపంచంలోనే అతి చిన్న రైలు జర్నీ కూడా ఉంది. ఈ రైలులో జర్నీ సమయం కేవలం 1 నిమిషం ఉండవచ్చు అంతే. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link