Ghost or Haunted Railway Stations: ఆ ఆరు రైల్వే స్టేషన్లలో దెయ్యాలు తిరుగుతున్నాయి..బీ కేర్ ఫుల్

Sun, 20 Feb 2022-2:32 pm,

గ్లేన్ ఈడెన్ రైల్వే స్టేషన్, న్యూజిలాండ్

డెడ్ బాడీస్‌ను వారి కుటుంబసభ్యులకు చేర్చేందుకే ఈ స్టేషన్ ప్రారంభించారు. 2011లో ఈ స్టేషన్ ఆధునీకరించిన తరువాత ఇక్కడొక కెఫే ప్రారంభమైంది. ఈ కెఫేలో ఎప్పుడూ ఓ నీడ కన్పించేదట. ఎలెక్స్ మ్యాక్ ఫార్లేన్ అనే ఓ రైల్వే కార్మికుడు 1924లో ఓ ప్రమాదంలో ఇక్కడ మరణించాడు.

ప్యాంటోనెస్ స్టేషన్, మెక్సికో

మెక్సికో సిటీలోని లైన్ 2 పై ఉన్న స్టేషన్ ఇది. ఇది కూడా ప్రపంచంలోని హాంటెడ్ స్టేషన్లలో ఒకటి. ఈ స్టేషన్ సమీపంలో రెండు స్మశానాలున్నాయి. ఇక్కడున్న సొరంగమార్గాల్లో ఎవరో నడుస్తున్నట్టుగా విన్పిస్తుంటుంది. కొంతమందికి ఇక్కడ ఏవో తెలియని నీడలు కూడా కన్పించి మాయమయ్యాయి. గోడల్నించి ఎవరో నడుస్తున్న శబ్దం వస్తుంటుంది.

కావోబావో రోడ్ సబ్‌వే స్టేషన్, చైనా

ఇది చైనాలోని అత్యంత భయం గొలిపే రైల్వే స్టేషన్. షాంఘై సబ్‌వే స్టేషన్ లైన్ 1 పై ఈ స్టేషన్ నిర్మించారు. ఇక్కడ తరచూ రైళ్లు రిపేర్‌కు గురి కావడం లేదా రాత్రిళ్లు దెయ్యాలు వెంటాడుతున్నట్టు కన్పిస్తుంది. కొంతమందిని ఎవరో నెట్టడం కారణంగా చనిపోవడం కూడా జరిగింది.

ఎడిస్‌కోంబో రైల్వే స్టేషన్, బ్రిటన్

ఇది కూడా భూతాల స్టేషన్లలో ఒకటి. 1906లో కేవలం కలపతో నిర్మించిన రెండు కౌంటర్లు, ఒక ప్లాట్‌ఫామ్‌తో ఈ స్టేషన్ ప్రారంభమైంది. ఇక్కడ ట్రైన్ డ్రైవర్‌కు దెయ్యం కన్పిస్తుందట. చాలామందికి దెయ్యం నీడ కూడా కన్పించిందని సమాచారం. ఈ రైల్వే స్టేషన్‌ను పడగొట్టినప్పుడు కూడా దెయ్యం కన్పించిందట. 2001లో ఈ స్టేషన్‌ను పడగొట్టేశారు.

మ్యాక్స్‌వెరీ ఫీల్డ్స్ ట్రైన్ స్టేషన్, ఆస్ట్రేలియా

ఈ రైల్వే స్టేషన్..సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉంది. ఇక్కడ అర్ధరాత్రి వరకూ ఓ టీనేజ్ అమ్మాయి తిరుగుతూ కన్పిస్తుందట. కొంతమందైతే ఆ అమ్మాయి అరుపులు కూడా విన్నారట. రక్తం కారుతూ..గట్టిగా గెంతులేస్తూ తిరుగుతుందట

యూనియన్ స్టేషన్, అమెరికా

ఈ స్టేషన్‌ను 1995లో మూసివేశారు. ఇక్కడొక దెయ్యం ఉండేదట. రైల్వే కూలీలు ఆ దెయ్యాన్ని ప్రేమగా ఫ్రెండ్ అని కూడా పిల్చుకునేవారట. ఈ దెయ్యం ఉండే గదిలోకి ఎవరూ వెళ్లేవారే కాదు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link