Xiaomi 15 Series: వావ్.. 200 MP కెమెరాతో అద్భుతమైన Xiaomi 15 సిరీస్ రాబోతోంది!
స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌లో Xiaomi లాంచ్ చేయబోయే మొబైల్స్‌లో 15 సిరీస్ ఒకటి. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
ఈ Xiaomi 15 సిరీస్‌ను కంపెనీ 2025 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రానుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన సోనీ LYT-900 సెన్సార్ కెమెరాతో రాబోతోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా మోడల్‌లో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 10x ఆప్టికల్ జూమ్ సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది.
ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఎంతో శక్తివంతమైన 6200mAh బ్యాటరీతో అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు దీని డిస్ల్పే 2K రిజల్యూషన్ సపోర్ట్‌తో రాబోతోంది. అంతేకాకుండా ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ Android 15 ఆధారిత HyperOS 2.0పై పని చేస్తుంది. దీంతో పాటు 25010PN30G మోడల్స్‌లో లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.