Xiaomi 15S Series Pics: శక్తివంతమైన 50MP కెమెరాతో షావోమీ కొత్త సిరీస్‌ మొబైల్స్‌.. అబ్బబ్బా ఫీచర్స్‌ భలే ఉన్నాయ్‌.. మొదటి ఫోటోస్‌ ఇవే!

Mon, 06 Jan 2025-11:44 am,

ఇక ఈ  Xiaomi 15S స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌కి సంబంధించిన ప్రకటన త్వరలోనే  షావోమీ (Xiaomi) ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

ఈ సిరీస్‌లో Xiaomi 15Sతో పాటు Xiaomi 15S Pro రెండు మొబైల్స్‌లో లాంచ్‌ కాబోతున్నాయి. అంతేకాకుండా వీటిని కంపెనీ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో విడుదల కానున్నాయి. అలాగే ఈ మొబైల్స్‌ విడుదలైతే.. ప్రపంచంలో ప్రత్యేక టెక్నాలజీతో కూడిన ప్రాసెసర్‌ కలిగిన మొదటి సిరీస్‌ అవుతుంది.   

ఈ స్మార్ట్‌ఫోన్‌ 2022లో ప్రవేశపెట్టిన Xiaomi 12S సిరీస్‌కి సక్సెసర్‌గా విడుదల కాబోతున్నట్లు సమాచారం. గతంలో  S లైనప్‌లో వచ్చిన అన్ని ఫోన్స్‌ అద్భుతమైన సక్సెస్‌ను సాధించినట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతుంది. కాబట్టి ఇది కూడా మార్కెట్‌లో సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.   

ఇటీవలే కొంతమంది బ్లాగర్స్‌ Xiaomi 15S ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ చేశారు. ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఇది త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా దీని ప్రధాన కెమెరా 50MP ఫిక్స్‌డ్-ఎపర్చరు సెన్సార్‌తో లాంచ్‌ కానుంది. అలాగే అదనంగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరాలు ఉంటాయి.  

ఇక ఈ రెండు మొబైల్స్‌ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా Xiaomi 15S ప్రో స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  షావోమీ (Xiaomi) కంపెనీ త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్స్‌ వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link